గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (12:13 IST)

భార్యతో అసహజ శృంగారం - రూ.కోటి డిమాండ్ చేస్తున్న భర్త

video
కట్టుకున్న భార్యతో అసహజ శృంగారంలో పాల్గొన్న భర్త.. తాను చేసిన పాడుపనిని వీడియో తీశాడు. ఆ తర్వాత తనకు కోటి రూపాయల కట్నం ఇవ్వాలని లేనిపక్షంలో ఈ వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేస్తానంటూ భార్యను బెదిరించాడు. పైగా, డబ్బు కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగింది. 
 
అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని, నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 
 
పైగా, తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త.. స్వస్థలం కాన్పుర్‌ కావడం వల్ల ఈ కేసును పోలీసులు అక్కడికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.