సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శుక్రవారం, 28 జనవరి 2022 (19:46 IST)

ప్రియుడి కోసం భర్తకి తెలియకుండా రూ. 2 లక్షలు ఇచ్చేసింది, డబ్బులడిగితే ఆ మాట అన్నాడు...

కుటుంబం సంతోషంగా ఉండాలని భావించాడు. ఎంత కష్టమైనా ఫర్వాలేదు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలను వదిలి విదేశాలకు వెళ్ళాడు. తాను తినకపోయినా భార్యాపిల్లల కోసం కొంత డబ్బును నిరంతరం పంపిస్తూనే ఉండేవాడు. అయితే భర్త నమ్మకాన్ని ఆ వివాహిత వమ్ము చేసింది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ చివరకు మోసపోయానని తెలిసి ఆత్మహత్య చేసుకుంది.

 
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లాలోని కుములూరుకు చెందిన మీనా, బాలసుబ్రమణ్యన్‌కు ఇద్దరు పిల్లలు. ఒకరికి పదేళ్ళు.. మరొకరికి పన్నెండేళ్ల వయస్సు. సుబ్రమణ్యన్ మార్కెంటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నప్పటికీ ఆ డబ్బు సరిపోలేదు. దీంతో విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఆరు నెలల క్రితం అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్ళాడు. 

 
డబ్బులు సంపాదిస్తూ భార్యకు పంపిస్తూ ఉండేవాడు. అయితే అప్పటికే మీనాకు సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇంటికి అతి సమీపంలో ఉండటంతో పాటు దూరపు బంధువు కావడంతో వీరిద్దరు శారీరకంగా కలుస్తూ ఉండేవారు.

 
తను కూడా నీ భర్తలా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను. నాకు కొంత డబ్బులు కావాలి. నేను అక్కడ సంపాదించి నిన్ను కూడా తీసుకెళతానని చెప్పాడు. మీనా నమ్మేసింది. భర్త పంపిన డబ్బుల్లో 2 లక్షల దాకా ప్రియుడికి ఇచ్చింది. దీంతో అతను విదేశాలకు వెళ్లాడు. ప్రియుడి కోసం గతంలో అప్పుడప్పుడు హద్దులు దాటి అతడు అడిగిన రీతిలో వీడియోలో కనిపించేది. అలాంటివన్నీ తనవద్ద పెట్టేసుకున్నాడతడు.

 
మరోవైపు విదేశానికి వెళ్లిన సురేష్ గత వారంరోజుల నుంచి మీనాతో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. దీంతో ఆమె మనస్థాపానికి గురైంది. తన భర్త డబ్బులు అడుగుతున్నాడని డబ్బులైనా ఇమ్మని ప్రాధేయపడింది. దీంతో నువ్వు నాతో గడిపిన ఏకాంత వీడియోలను ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో భర్తకు ఏం చెప్పాలో తెలియక ఆవేదనకు గురైన మీనా జరిగిన వ్యవహారాన్ని మొత్తం పేపర్ పైన రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మీనా ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం నెలకొంది.