1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 12 జులై 2025 (14:48 IST)

బావమరిదిని పొడిచి చంపిన బావ: నెల్లూరు ఉదయగిరిలో దారుణం

crime
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం జరిగింది. ఓ ఫంక్షన్ హాలు నిర్వహణ నిమిత్తం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. గత కొంతకాలంగా బావమరిది హమీద్‌తో అల్ ఖైర్ ఫంక్షన్ హాలు నిర్వహణ విషయంలో అతడి బావ హనీఫ్ గొడవ పడుతున్నాడు. ఈ ఉదయం వాగ్వాదం మరింత పెరిగి ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకూ వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి గురైన హనీఫ్ తన బావమరిది హమీద్‌ను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేసాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు.
 
హత్య కేసులో కాళహస్తి జనసేన ఇన్ చార్జ్ వినుత బహిష్కరణ
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలియజేసింది. చైన్నై నగరంలో కూవం నదిలో కాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు శవమై తేలాడు. ఇతడిని ఐదుగురు వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడవేసినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఈ నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన జనసేన ఇంచార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు కూడా వున్నారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. వారిలో వినుత, చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే ఐదుగురు వున్నారు. సీసీటీవి ఫుటేజిలో వీళ్లంతా అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.