మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూంలో పడేశారు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మద్యమత్తులో కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గర్భస్రావం చేయించేందుకు ఢిల్లీకి రైలులో తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో రైలు బోగీలో ప్రసవించింది. దీంతో ఆ పసికందును ఓ బ్యాగులో ఉంచి రైలు మరుగుదొడ్డిలో వదిలిపెట్టారు. అయితే, ఆయితే, ఆ బ్యాగులో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా అసలు నిందితుడుని పోలీసులు గుర్తించారు. అతని వద్ద జరిపిన విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రానికి చెందిన చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె తండ్రి మద్యం మత్తులో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. బాలికకు చికిత్స చేయించడానికి రైలులో ఢిల్లీకి తీసుకువెళ్తున్న సమయంలో బాత్రూంకు వెళ్లిన బాలిక అక్కడే ఓ మగబిడ్డను ప్రసవించింది.
వెంటనే ఆమె కుటుంబసభ్యులు ఎవరికీ అనుమానం రాకుండా ఆ బిడ్డను ఓ బ్యాగులో చుట్టి.. పట్నా- చండీగఢ్‌కు వెళ్లే మరో రైలులోని బాత్రూమ్ చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయారు. రైలులోని ప్రయాణికులు శిశువు ఏడుపులు విని బ్యాగ్ తెరిచి చూడగా అందులో అప్పుడే పుట్టిన పసికందు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడకు చేరుకొని శిశువును వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అదే బ్యాగులో దొరికిన సిమ్‌కార్డు ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసగా మారిన తన తండ్రి.. ఏడాదిగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని మైనర్ బాలిక పోలీసులకు వెల్లడించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని.. మైనర్ బాలికను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు తరలించారు. చిన్నారిని పెంచుకునే స్థోమత తమకు లేదని అందుకే రైలు బోగీలో వదిలివేసినట్టు వెల్లడించారు.