గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

కేపీహెచ్‌బీలో గుర్తుతెలియని మృతదేహం కలకలం - కాల్చి చంపారా?

black magic
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఓ యువకుడిని చంపేసి శవాన్ని తగులబెట్టారు. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ దారుణమైన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
హైదర్ నగరులోని అలీ తలాబ్ శ్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని శవం మంటల్లో కాలుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఎవరినో హత్య చేసి శ్మశానవాటికలో నిప్పంటించి హత్య చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పైగా, ఈ నెల 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని  స్థానుకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చి, శవాన్ని కాల్చివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.