1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 మే 2025 (08:37 IST)

అశ్లీల వీడియోలు చూపించి హోంగార్డు వేధిస్తున్నాడు...

Lady victim
గుంటూరు జిల్లాలోని ఓ హోంగార్డు పాడుపనికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యకు అశ్లీల వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పాతగుంటూరులో వెలుగు చూసింది. ఈ వేధింపులను తట్టుకోలోని ఆ యువత తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్‌నంటూ చెప్పి తనను పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతున్నాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు. రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశించారు. 
 
పాతగుంటూరుకు చెందిన ఆమె బీఎస్సీ చదివారు. 8 నెలల కిందట అలీనగర్‌కు చెందిన ఫణీంద్రకుమార్‌తో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లికి ముందు అతను కానిస్టేబుల్ అని చెప్పారు. అత్తారింటికి వెళ్లాక హోంగార్డు అని తెలిసింది. అతను ఓ మహిళతో ఉన్న ఫొటో బయటపడింది. ఆరా తీస్తే.. మూడేళ్ల కిందట పొత్తూరుకు చెందిన ఓ మహిళతో వివాహమైందని, ఆ విషయం దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని తేలింది. 
 
అలా ఎందుకు చేశారని నిలదీసినందుకు దుర్భాషలాడి.. దాడి చేస్తున్నాడు. రాత్రివేళల్లో అశ్లీల వీడియోలు చూపించి వేధించి, రక్తం వచ్చేలా కొట్టి.. మూత్రం తాగించేవాడని ఆమె ఆవేదనతో చెప్పారు. అతను ఇంట్లో లేని సమయంలో మామగారు అసభ్యకరంగా ప్రవర్తించేవారని తెలిపింది. ఆ బాధలు భరించలేక ఇటీవల పుట్టింటికి వచ్చేశానని, తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.