శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (12:20 IST)

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ యువకుడి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ విషాదకర ఘటన సంభవించింది. ఓ యువకుడు ఫ్లెక్సీ కడుతూ దుర్మరణం పాలయ్యాడు. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి లోనుకావడం ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా అధికార తెరాస పార్టీ నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 
 
దీంతో కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద తెరాస ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనలో మరో యువకుడు కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.