గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (20:01 IST)

పిల్లలు పుట్టలేదని మర్మాంగాన్ని కోసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త

పిల్లలు పుట్టలేదు. అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి సూటిపోటి మాటలు. దానికితోడు ఒక రోగం తగ్గితే మరో రోగం. దీంతో అతను భరించలేకపోయాడు. ఆర్థిక సమస్యలు లేకపోయినా ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా మర్మాంగాన్ని కోసుకుని మరీ..

 
బెంగుళూరు సిటీకి చెందిన జ్ఞానప్పకు ఐదు సంవత్సరాల క్రితమే వివాహమైంది. సొంత అత్త కూతురినే వివాహం చేసుకున్నాడు. మేనరికం సమస్యేమో గానీ పిల్లలు పుట్టలేదు. అయితే జ్ఞానప్ప బాగా ఆస్తిపరుడు. పిల్లలు పుట్టలేదన్న ఒత్తిడిలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే వుంటున్నాడు. కానీ బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మాటలను భరించలేకపోయాడు.

 
నీకు వయసైపోతోంది. నీ భార్యకు పిల్లలు పుట్టరా.. ఆసుపత్రికి వెళ్ళండి అంటూ కుటుంబ సభ్యులు చెప్పే మాటలను అతడిని బాధించాయి. ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా, ఎన్ని గుళ్ళూగోపురాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మానసికంగా కృంగిపోయాడు.

 
ఇంట్లో భార్య గుడికి వెళ్లింది. దీంతో బాత్రూంకు వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తన మర్మాంగాన్నికోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న జ్ఞానప్పను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. మార్గమధ్యంలోనే చనిపోయాడు.