సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:15 IST)

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం... పొరుగింటి మహిళ ఫిర్యాదు

victim
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు సమాచారం. తన కుమార్తెను ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలుడిపై ఐపీసీ 376తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనపై బాలిక తల్లి అక్బర్ పూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పిల్లలిద్దరికీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాచారం జరిగినట్టు తేలడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకరాం ఏడేళ్ళలోపు చిన్నారులు చేసే ఏ చర్యను అయినా నేరంగా పరిగణించరాదు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్ పూర్ పోలీసులు వెల్లడించారు. కేసులో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకెళతామని చెప్పారు.