సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 జులై 2023 (07:54 IST)

విశాఖలో ఘోరం.. నేవీ అధికారి కుమార్తెపై అత్యాచారం?

victim
విశాఖపట్టణంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న నేవీ అధికారి కుమార్తెను నగ్నంగా వీడియో తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖ నగరంలోని కంచరపాలెంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఆమె చదువుతున్న పాఠశాలలోనే అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నగ్న వీడియోలతో కొంతకాలంగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పైగా, ఆ వీడియోలను స్నేహితులకూ పంపడంతో వారు కూడా బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడసాగారు. ఇది వెలుగులోకి రాగానే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 
 
విశాఖనగరం కంచరపాలెం 104 ఏరియాకు చెందిన ఓ నేవీ అధి కుమార్తె సమీపంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో అటెండర్‌ పనిచేస్తున్న సత్యారావు(40), బాలిక నివసించే అపార్టుమెంటులోనే నివసిస్తున్నాడు. బాలికతో చనువు పెంచుకొని, డ్రాయింగ్ నేర్పిస్తానంటూ బాలిక ఇంటికి కూడా వెళుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు. ఇంట్లో ఎవరైనా ఉంటే డ్రాయింగ్ పేరుతో టెర్రస్‌పైకి తీసుకెళ్లి లైంగికదాడి చేసేవాడు. 
 
బాలిక నగ్న వీడియోలు తీసి స్నేహితులకు పంపించాడు. దీంతో వారు కూడా బాలికను బెదిరించి గతనెల మూడో తేదీ నుంచి 23వ తేదీ వరకూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం. బాలిక ఇంట్లో ముభావంగా ఉంటుండటంతో ఈ నెల 6న తల్లి ప్రశ్నించింది. దీంతో జరిగిన దారుణాన్ని ఆమె తల్లికి వివరించింది. అదేరోజు విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదుచేయగా, కేసు నమోదుచేసి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును దిశ పోలీస్ స్టేషను బదిలీ చేశారు. 
 
దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు బాలికపై సత్యారావు లైంగికదాడికి పాల్పడినట్టు సాక్ష్యాధారాలను సేకరించారు. అతడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి. రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం షాక్‌లో ఉన్న బాలిక చికిత్స పొందుతోందని, సత్యారావు ఒక్కడే లైంగికదాడికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఏసీపీ చెప్పారు. ఆమెపై మరో ముగ్గురు లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు.