గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (14:11 IST)

భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య.. ఎక్కడంటే?

crime scene
వేద మంత్రాల సాక్షిగా మనువాడిన భర్తను ప్రియుడితో హత్య చేయించింది ఓ కిరాతక భార్య. తన వివాహేతర సంబంధం కొనసాగించడానికి భర్తను పొట్టనబెట్టుకుంది. అయితే పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడి కావడంతో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన బోధన్ హనుమబోయి అనే వ్యక్తికి అనురాధతో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనురాధ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న పోష బోయితో వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
తనకు తన ప్రియుడికి మధ్యలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనురాధ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకొని ఇద్దరూ శాశ్వతంగా కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రియుడికి భర్తను హత్య చేసే పనిని అప్పగించింది. ఇక హనుమబోయికి బాగా మద్యం తాగించి అతను మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతుకు ముడివేసి హత్య చేశారు పోష బోయితో పాటు అతని స్నేహితులు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తానే ప్రియుడితో కలిసి జీవించాలని భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు అనురాధతో పాటు ఆమె ప్రియుడు పోష బోయి, రమేష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.