అందమైన భామ ఆ వీడియోతో డిప్రెషన్ లోకి వెళ్ళి?
ఆమె ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో వల్ల ఏకంగా ఆమె ఉద్యోగమే హుష్ పటాక్ అయిపోయింది.
పోలీసు యూనిఫాంలో ఉండి రివాల్వర్‌ను చేతిలో పట్టుకుని సినిమాలో మాదిరిగా డైలాగ్స్ చెబుతూ ఒక వీడియోను షూట్ చేసింది మిశ్రా. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిలంమీద గుగ్గిలం అయ్యారు. ఆమె తీరును తూర్పూరబట్టారు. ఒక పోలీసయి ఉండి ఇలా చేస్తారా అంటూ ఫైరయ్యారు. ఇక ఈ వ్యవహారం కాస్త పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో వారు విధులకు ఆమెను దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.