Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిజెపికి అంతా మైత్రేయనే.. ఆయన చెప్పినట్టే గవర్నర్ నడుచుకుంటున్నారా?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (20:35 IST)

Widgets Magazine
vmaitreyan

అసలు వి.మైత్రేయన్ ఎవరు. ప్రస్తుతం ఈయన రాజ్యసభ్యుడిగానే మాత్రమే చాలామందికి తెలుసు.. కానీ మొత్తం తమిళనాడు రాజకీయాలను నడిపిస్తుందో ఈయనే. ఇంకా అర్థం కాలేదా... బిజెపికి ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను చేరవేస్తూ పన్నీరుసెల్వంను సిఎం చేయడానికి పావులు కదుపుతుంది ఈయనే. నిజమే.. మీరు విన్నది.
 
ఆయన ఒక సాధారణ రాజ్యసభ సభ్యుడు. తమిళనాడులో మైత్రేయన్ అంటే చాలామందికి తెలియదు గానీ బిజెపి కేంద్రమంత్రులకు మాత్రం బాగా తెలిసిన వ్యక్తి. అందులోను పన్నీరు సెల్వంకు, బిజెపి మధ్య సయోధ్యను కుదుర్చుతున్న వ్యక్తి ఈయనే. ఎలాగంటారా.. పన్నీరుసెల్వంను సిఎం చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, బిజెపి ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు బిజెపి నాయకులు.
 
ఇప్పటికే బిజెపి నాయకత్వం నుంచి పూర్తి స్థాయిలో హామీ లభించింది పన్నీరు సెల్వం.. నిన్నే సిఎం చేస్తారని. అందుకే ప్రస్తుతం పన్నీరుసెల్వం ఎంతో ప్రశాంతంగా ఉండిపోతున్నారు. శశికళ అక్రమాస్తుల కేసులో దోషి అయిపోతారని ముందు నుంచే పన్నీరు సెల్వం చెబుతూ వస్తున్నారు. అంటే పన్నీరు సెల్వంకు ఎలా తెలుస్తుందంటారు..అదే మరి..బిజెపి ఆడిపిస్తున్న నాటకాలే ఇదంతా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శశికళను అన్ని విధాలుగా బిజెపి ఇరికిస్తుందనడానికే జరుగుతున్నవే కారణం. మంగళవారం శశికళకు జైలుశిక్ష పడి ఆ తర్వాత పళణిస్వామి పేరును ఖరారు చేసి గవర్నర్ వద్దకే పంపింది. చివరకు పళణిస్వామి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు కానీ ప్రయోజనం మాత్రం పెద్దగా కనిపించని పరిస్థితి.
 
అదేంటి పళణిస్వామి వెనుక 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ప్రయోజనం లేకుండా పోవడమేంటి అని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్ ఇక్కడ. ఎలాగంటారా.. పళణిస్వామిపై ఫిర్యాదు చేశారు ఎంపి మైత్రేయన్. ఈయన బిజెపికి అత్యంత సన్నిహితుడు. ఇదంతా గవర్నర్‌కు తెలుసు. అందుకే మైత్రేయన్ ఎప్పుడు అపాయింట్‌మెంట్ అడిగినా తక్షణం ఇస్తేస్తుంటారు. ప్రస్తుతం మైత్రేయన్ అంతా నడిపిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. మొత్తం మీద మైత్రేయన్ పన్నీరుసెల్వంను సిఎంను చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న శశికళ - సీఎం పీఠం పన్నీరుకు రాకుండా మోకాలడ్డు..!

తనకు దొరకంది.. వేరొకరిది దొరకకూడదన్న చందంగా శశికళ వ్యవహరిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల ...

news

శశి గొంతెమ్మ కోర్కెలు... జైలు గదిలో ఏసీ, హాట్ వాటర్, టీవీ... న్యాయమూర్తి సీరియస్

శశికళ తన తడాఖా ఏమిటో తమిళనాడు నుంచి బెంగళూరు వరకూ తన కాన్వాయ్ తో చెప్పేసింది. ఈ కాన్వాయ్ ...

news

రెసార్ట్‌లో ఎమ్మెల్యేల మస్తు మజా.. చిన్నమ్మ బిల్లు కట్టి జైలుకెళ్లారా? లేకుంటే పన్నీర్ కట్టాలా? (ఫోటోలు)

తమిళ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభంతో శశికళ వెంట నిలిచిన ఎమ్మెల్యేలు మస్తు మజా చేశారు. ...

news

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు ...

Widgets Magazine