శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 19 అక్టోబరు 2016 (12:50 IST)

ఎందుకంత అస‌హ‌నం? స‌ర్వేల ఫ‌లితం... బాబులో అభద్ర‌తాభావం...?

విజ‌య‌వాడ‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈమ‌ధ్య చాలా అస‌హ‌నంగా ఉంటున్నారు. అధికారులు, అనుచ‌రుల‌పై అరిచేస్తున్నారు. తాజాగా నిన్న మంత్రివ‌ర్గ స‌మావేశంలోనూ మంత్రుల‌కు చాలా సీరియ‌స్‌గా క్లాస్ తీసుకున్నారు. మీ ప‌నితీరు అస్స‌లు బాలేదు. మీవ‌ల్ల నేను కూడా మునిగేట్లు

విజ‌య‌వాడ‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈమ‌ధ్య చాలా అస‌హ‌నంగా ఉంటున్నారు. అధికారులు, అనుచ‌రుల‌పై అరిచేస్తున్నారు. తాజాగా నిన్న మంత్రివ‌ర్గ స‌మావేశంలోనూ మంత్రుల‌కు చాలా సీరియ‌స్‌గా క్లాస్ తీసుకున్నారు. మీ ప‌నితీరు అస్స‌లు బాలేదు. మీవ‌ల్ల నేను కూడా మునిగేట్లు ఉన్నా అని తీవ్ర ప‌ద‌జాలాన్ని చంద్ర‌బాబు వాడిన‌ట్లు స‌మాచారం. అస‌లింత‌కీ ఆయ‌న ఆందోళ‌న‌కు అస‌లు కార‌ణాలేంటి?
 
రోజుకు 18 గంటలు పని చేస్తాను... అని నిబ్బరంగా ప‌నిచేసే సీఎం చంద్రబాబు ఈమ‌ధ్య ఆందోళనతో పాలన సాగిస్తున్నారు. ఎవరో వెంటపడి తరుముతున్నట్లు తప్ప, నిబ్బరంగా, నిదానంగా.. ఓర్పుగా నేర్పుగా ప‌ని చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాల‌ను విశ్లేషిస్తే, అమరావతి రాజధానికి నిధుల కొరత, కేంద్రం మొండిచేయి, కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు, లోకేష్ మీద వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో ఈ అంశాలు చర్చకు రావడం వంటివి చంద్రబాబులో అలజడి రేపుతోందని తెలుస్తోంది.
 
రాజధాని కోసం బలవంతంగా భూముల్ని అయితే సేకరించారు గానీ, వాటిల్లో పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆయ‌న మాట నెర‌వేర్చ‌లేని మంత్రులకు అధికారులు కూడా తోడయ్యారు. 2019 నాటి ఎన్నికలకు తన తనయుడు లోకేశ్‌ను తెరమీదకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దామనే చంద్రబాబు కలలు నెరవేరేలా లేవు. విజన్ 2050తో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించాలనే చంద్రబాబు కలలు ఆవిరయ్యే క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అందుకే ఆయన నిత్యం ఆందోళన చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఇటీవలి కాలంలో మంత్రులు సైతం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఆయ‌న మూడ్ ఎలా ఉంటుందో అనే ఆందోళన. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా సలహాలు సూచనలు ఇద్దామనే ప్రయత్నం చేస్తే సి.ఎం. కస్సుబుస్సులాడుతున్నార‌నే వాదనలు వినిపిస్తున్నాయి. నిత్యం పొగుడుతూ, భజన చేసే బ్యాచ్‌ మాత్రం చంద్రబాబునూ, ఆయన తనయుడినీ బుట్టలో వేసుకుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. 
 
మీడియాలో కొందరు ఆయన మంచి కోసం ప్ర‌శ్నించినా సీఎం చంద్ర‌బాబు అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఎక్కడా అడుగు ముందుకు పడటం లేదు. ఎక్కడి పైళ్లు అక్కడే పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమంత్రే నేరుగా జోక్యం చేసుకుంటుంటే ఇంకా తాము ఎలా  పని చేయగల‌మ‌ని మంత్రిత్వ‌ శాఖ‌లు పేర్కొంటున్నాయి. ఇక ప‌క్క‌లో బ‌ల్లెంలా ప్ర‌తిప‌క్షం ఉండ‌నే ఉంది. ఇక ప్ర‌శాంత‌త ఎక్క‌డుంటుంది?