1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 21 జులై 2016 (20:01 IST)

వెన్నెల రాజు పైకి యాత్ర.... తొలిసారిగా చంద్రునిపై అడుగు... జూలై 21

వెన్నెల కిరణాలను వెదజల్లుతూ చల్లని మలయమారుతంతో కలిసి వెండి వెన్నెలలను పూయించే చందమామ అంటే ప్రతి ఒక్కరి మనసు జివ్వున లాగేస్తుంది. అలాంటి చంద్రుడు పైన అడుగుపెట్టిన క్షణాలు ఎలా వుండివుంటాయి. ఆ అనుభవం వర్ణనాతీతమే కదా. సరిగ్గా జూలై 21, 1969లో నీల్ ఆర్మ్‌స

వెన్నెల కిరణాలను వెదజల్లుతూ చల్లని మలయమారుతంతో కలిసి వెండి వెన్నెలలను పూయించే చందమామ అంటే ప్రతి ఒక్కరి మనసు జివ్వున లాగేస్తుంది. అలాంటి చంద్రుడు పైన అడుగుపెట్టిన క్షణాలు ఎలా వుండివుంటాయి. ఆ అనుభవం వర్ణనాతీతమే కదా. సరిగ్గా జూలై 21, 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు.
 
చంద్రుడిపైన కాలు మోపాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన ముందస్తు ప్రయత్నాలు చాలా చేశారు. అందులో భాగంగా ఆయన మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8, 1966 సంవత్సరంలో ప్రయోగింపబడినది. ఈ మానవ సహిత అంతరిక్ష నౌకలో తన తోటి పైలెట్ డేవిడ్ స్కాట్‌తో కలిసి ఆయన ప్రయాణించాడు. ఇక అనుకున్న క్షణాలు రానే వచ్చాయి. చంద్రుడు పైకి వెళ్లాలన్నదే ఆయన లక్ష్యం. దీనితో ఆర్మ్‌స్ట్రాంగ్ రెండో అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో అత్యంత సాహసోపేతమైన ప్రయాణంలో భాగంగా వారు అపోలో 11 అంతరిక్ష నౌకతో చంద్రుడిపైన జూలై 20, 1969న ల్యాండ్ అయ్యారు. 
 
ఐతే ఆయన చంద్రుడి ఉపరితలం పైన కాలుమోపింది మాత్రం జూలై 21వ తేదీ. అలా చంద్రుడుపై అడుగుపెట్టాక అక్కడ వారు రెండున్నర గంటల పాటు సంచరించారు. ఆ సమయంలో... అంటే అపోలో 11 అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తున్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. దీనికి కారణం జెమిని 8 వాహనంలో ఉన్న శబ్దం కన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉండటమే. ఐతే అవన్నీ అధిగమించి వెన్నెలరాజుపై కాలుమోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్.