మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 28 ఏప్రియల్ 2018 (19:03 IST)

బిసిల బోనులో చంద్రబాబు.. ఎలా?

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలబడింది బిసిలు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పెద్దపీట వేసి ఎన్నో బిసి కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు కారకులయ్యారు. బిసి కులాలు అండ లేకుంటే తెలుగుదేశంపార్టీ రాష్ట్రంలో ఇంతగా వేళ్ళూనుకునేది కాదు. ఇప్పటికే బ

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలబడింది బిసిలు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పెద్దపీట వేసి ఎన్నో బిసి కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు కారకులయ్యారు. బిసి కులాలు అండ లేకుంటే తెలుగుదేశంపార్టీ రాష్ట్రంలో ఇంతగా వేళ్ళూనుకునేది కాదు. ఇప్పటికే బిసీలే ఆ పార్టీకి ప్రధానమైన బలగం. ఇటీవల కాలంలో బిసిలకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి తప్ప బిసిలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
 
ఈ ఆరోపణలు, విమర్శలు సంగతి ఎలా ఉన్నా న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబునాయుడు బిసిలకు అన్యాయం చేశారన్న వార్తలు ఇప్పుడు తెలుగుదేశంపార్టీని ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయి. జాతీయ బిసి కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఏడు రోజుల క్రితం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు బిసీల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్ర హైకోర్టులో బిసీల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఆరుగురు పేర్లను ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిప్రాయం కోరితే బిసిలైన అమరనాథ గౌడ్, అభినవ్ కుమార్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి 2017 మార్చిలో చంద్రబాబు రాసిన లేఖను ఈశ్వరయ్య బయటపెట్టారు. బాబు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే సుప్రీంకోర్టు జడ్జి ఒకరు వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. ఆ జడ్జి ముఖ్యమంత్రికి సన్నిహితుడని పేర్కొన్నారు. 
 
అయితే బాబు సమర్పించిన నివేదికను విశ్వసించకుండా ఇంటెలిజెన్స్ వర్గాలతో విచారణ చేయించుకున్న తరువాత అమరనాథ్ గౌడ్, అభినవ్ కుమార్‌లను హైకోర్టు జడ్జిలుగా నియమించారని జస్టిస్ ఈశ్వర్యయ్య చెప్పారు. బిసిల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వంలో బిసిల పట్ల ఇలా వ్యవహరించాడన్ని ఆయన తప్పుబట్టారు. తన కుటుంబానికి చెందిన వారిని జడ్జీలుగా నియమించుకునేందుకే ఇలా చేశారని ఆయన దుయ్యబట్టారు. 
 
ఈశ్వరయ్య లేవనెత్తిన ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షం వైసిపి కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. హైకోర్టులో బిసి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకంల విషయంలో చంద్రబాబు తమ కులస్తులకే ప్రాధాన్యత ఇస్తూ న్యాయమూర్తులుగా నియమింపజేస్తున్నారని, బిసిలను, ఇతర కులస్తులను పట్టించుకోలేదని విమర్సిస్తున్నారు. జనసేన కూడా ఈ అంశాన్ని ముందుకు తెస్తోంది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ సాగుతోంది. 
 
సుప్రీంకోర్టులో 25 మంది న్యాయమూర్తులుండగా బాబు సామాజిక తరగతికి చెందిన వారే ముగ్గురు ఉన్నారని ఎత్తి చూపుతున్నారు. ఈ దేశంలో దాదాపు ఏడు వందల కులాలుండగా బాబు కులం నుంచే ముగ్గురు ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపైన నోరు మెదపకుండా దాటవేద్దామని భావించొచ్చు గానీ బిసిల్లో మాత్రం తీవ్ర అలజడి రేపుతోందంటున్నారు. ఇది ఖచ్చితంగా టిడిపికి నష్టం వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.