Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీష శవంతో నాటకాలాడారు... మీడియాతోనే సాధ్యం.... బ్యూటీషియన్ శిరీష పేరేంట్స్

శనివారం, 1 జులై 2017 (21:10 IST)

Widgets Magazine
sirisha

బ్యూటీషియన్ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను కుకునూరు పల్లిలోనే చంపేసి ఆ శవంతో హైదరాబాదు వచ్చి రాజీవ్, శ్రవణ్ ఇద్దరూ నాటకాలాడారంటూ ఆరోపిస్తున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయించాలని తాము మీడియా ద్వారా పోలీసు వారిని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఆర్జే స్టూడియోకు శవాన్ని తీసుకువచ్చి ఆమె చేతి వేలితో బయోమెట్రిక్ మెషీన్ ద్వారా థంబ్ ఇంప్రెషన్ చేయించి లోనికి తీసుకెళ్లి ఆ శవానికే ఉరి వేసి నాటకాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 
 
వీడియో కాల్ చేస్తే రాజీవ్ అనే వ్యక్తి ఎందుకు అటెండ్ చేయలేదు..? ఎందుకంటే ఆమె ఫోన్ నుంచి కాల్ చేసింది అతడే... అతడి ఫోన్ లిప్ట్ చేయకుండా నాటకలాడింది అతడే కాబట్టి అంటూ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నేరస్థులను కాపాడాలని పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తమకు అర్థం కావడంలేదన్నారు. మరోవైపు శిరీష భర్త మాట్లాడుతూ... తన భార్య క్యారెక్టర్‌పై లేనిపోని నిందలు వేయొద్దన్నారు. తన భార్య శిరీషతో తాను చాలా హ్యాపీగా ఉండేవాడినని భర్త సతీష్ చంద్ర అన్నారు. 
 
ఆర్జే స్టూడియోలో మాత్రమే శిరీష పనిచేయలేదని.. బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్‌లో కూడా శిరీష పార్ట్ టైమ్‌గా పనిచేసిందని సతీష్ చంద్ర చెప్పారు. దాదాపు ఏడాది నుంచి బెంగళూరు సంస్థలో ఆమె పనిచేస్తుందని.. నెలకు 30 నుంచి 40వేల వరకు డ్రా చేసేదని.. తాను నెలకు 15-20 వేల దాకా సంపాదించే వాడినని.. అయినప్పటికీ తమ మధ్య ఇగో సమస్యలు రాలేదని.. హ్యాపీగా ఉండేవాళ్లమని సతీష్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆర్జే స్టూడియోలో చేరి ఆరునెలలు అయ్యిందన్నారు.
 
ఈ కేసును ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని.. రోజూ మీడియాలో శిరీషను చూపించి.. ఆమె క్యారెక్టర్‌పై నిందలేస్తున్నారని సతీష్ చంద్ర వాపోయారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలూ లేవని అన్నారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పుకొచ్చారు. తాను ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానన్నారు. శిరీషది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని సతీష్ చంద్ర వాదిస్తున్నారు. ఈ కేసుపై స్పెషల్ ఎక్వైరీ జరిపించాలని సతీష్ చంద్ర డిమాండ్ చేశారు.
 
శిరీషను హత్య చేసిన తర్వాతే హైదరాబాదుకు తీసుకొచ్చారని, ఆమె ప్రమాదంలో ఉండటంతోనే రెండుసార్లు లొకేషన్ తనకు షేర్ చేసిందని సతీష్ చంద్ర అన్నారు. రాజీవ్, శ్రవణ్‌ల నుంచి నిజాన్ని ఎందుకు రాబట్టలేదని సతీష్ చంద్ర ప్రశ్నిస్తున్నారు. కుకునూర్‌పల్లి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఆశ్చర్యంగా ఉందనీ, పోలీసులు కెమెరా విజువల్స్ ఉన్నాయని చెప్పినా వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదని సతీష్ చంద్ర ప్రశ్నించారు. క్యారెక్టర్ మీద ఫోకస్ ఆపేసి.. క్రైమ్ మీద ఫోకస్ పెట్టండంటూ సతీష్ చంద్ర అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Murdered Hyderabad Crime Beautician Sirisha Sirisha Family Members

Loading comments ...

తెలుగు వార్తలు

news

విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా ఉంటుంది? (video)

బస్సుల్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ నీరు టాప్ నుంచి బస్సులోనికి రావడం చూసేవుంటాం. అయితే ...

news

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని హతమార్చి.. నగదుతో ఉడాయించిన యువతి..

ఫేస్‌బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం ...

news

షాకింగ్... తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు నరబలి...?

నరబలి అనే మాట వింటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. ఈ నరబలి అనే మాటను ఇదివరకటి బ్లాక్ అండ్ వైట్ ...

news

శిరీషతో హ్యాపీగా ఉన్నా.. నా భార్య క్యారెక్టర్‌పై నిందలొద్దు.. రోజూ మీడియాలో?: సతీష్ చంద్ర

హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఆర్జే స్టూడియోలో పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ...

Widgets Magazine