1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శుక్రవారం, 15 జులై 2016 (11:56 IST)

ఆయనతో వేగలేకపోతున్నారట... భూమా తట్టాబుట్టా సర్దుకుంటున్నారట... వైసీపి గూటికి మళ్లీ...?

క‌ర్నూలు: కర్నూలు జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీరుతో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. త్వ‌ర‌లో భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజ‌శేఖ‌ర్ తిరిగి వైసీపీకి వెళ్ళిపోయే ప‌రిస్థి

క‌ర్నూలు: కర్నూలు జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీరుతో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. త్వ‌ర‌లో భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజ‌శేఖ‌ర్ తిరిగి వైసీపీకి వెళ్ళిపోయే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. టీడీపీలోకి రావాలి అనుకొన్న మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు శిల్పా ప్రవర్తన వల్ల ఆగిపోయినట్లు సమాచారo. జిల్లాలో రెండూ ఎస్.సి. రిజర్వ్ నియోజకవర్గాల‌లో శిల్ప తన పలుకుబడితో తెదేపా అధినాయకత్వాన్ని తప్పు దోవ పట్టించి తన సామజిక వర్గానికి చెందిన తన వ్యాపార భాగ‌స్వాములకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
 
దీంతో జిల్లాలో ఎస్సీలు ఆగ్ర‌హం చెందారు. శిల్ప ఒక పధ్ధతి ప్రకారం జిల్లాలోని నామినేట్ పోస్టుల‌ను వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో నుంచి వ‌చ్చిన వారికి ఇప్పించి తేదేపాలోని పాత వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతునట్లు సమాచారం. దీంతో పాత కేడర్ ఆందోళన చెందుతోంది. పార్టీ అధికారoలో లేనప్పుడు కష్ట‌పడ్డ నాయకులు, కార్యకర్తలు ఇపుడు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవ‌ల తేదేపాలో చేరిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగానే, శిల్ప తనకు న‌చ్చిన, అనుకూలంగా ఉండే అధికారులను బదిలీ చేయుంచుకోవడంతో ఎమ్మెల్యే బుడ్డా టీడీపీ మీద తీవ్ర అసoతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
 
ఈ బాధని తన మిత్రులకి చెప్పుకొని బుడ్డా బాధపడ్డట్లు స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆదోని మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేల‌తో తనకున్న వ్యాపార లావాదేవీలలో బాగాoగా అక్కడ తేదేపా ఇన్చార్జ్‌ల‌ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్లు చెపుతున్నారు. ఇక నంద్యాల నియోజకవర్గంలో మొదటినుంచి పార్టీ వెన్నoటి ఉన్న నాయకులను పార్టీ నుంచి బయటకి పంపే ప్రయత్నాలు మొద‌లుపెట్టారు. ఇటీవల జరిగిన ఓ సాధారణ సంఘటనలో ఒక మీడియా ప్రతినిధితో కలసి ఆ నాయకుడి ప్రమేయం లేకపోయినా చిన్నపిల్లల మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టించి పార్టీ నుంచి బయటికి పంపే ప్రయత్నం చేస్తునట్లు సమాచారం.
 
కర్నూలు జిల్లాలొ జరుగుతున్న విషయాలు తెదెపా అధినేత వద్దకి వెళ్ళ‌కుండా శిల్పా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా తెదెపా అధినేత కర్నూలు జిల్లాలో రెండవ కేడర్‌ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. మరోప‌క్క వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా రాజకీయాల మీద చూపుపెట్టినట్లు సమాచారం. తెదెపా మీద కోపంగా ఉన్నా భూమ నాగిరెడ్డి,  బుడ్డా రాజాశేఖ‌ర్ రెడ్డితో సంప్రదిస్తున్న‌ట్లు సమాచారం.