శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (10:42 IST)

చంద్రబాబుకు మూడిందా? మే23కి తర్వాత రిటైర్మెంట్ ఖాయమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే.. కానీ ఆయన అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిమియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం తేల్చిపారేశారు. పైగా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి తనను ఎలాంటి సమీక్షలకు ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. పవర్ లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన తేల్చి పారేశారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మే 23న రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. వచ్చే ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే.. ఇక చంద్రబాబుకు అన్ని దారులూ మూసుకుపోయినట్టే అని ఆ పత్రిక విశ్లేషించింది. 2004 నుంచి చంద్రబాబు రాజకీయ పోకడలను సునిశితంగా సదరు ఆంగ్ల పత్రిక విమర్శించింది. 
 
చంద్రబాబు ఎత్తుగడలు ఎలా విఫలమైందీ డిటైల్డ్‌గా చర్చించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా తప్పుటడుగులు వేసారని చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను వివరించారు. పవన్ కల్యాణ్ పార్టీ వేరుగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలుతుందని చంద్రబాబు తప్పుగా అంచా వేశారని ఆ పత్రిక పేర్కొంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా క్యాస్ట్, కరప్షన్, క్రైమ్‌గా సాగిపోయిందని ఆ పత్రిక రాసుకొచ్చింది. ఇది ప్రజావ్యతిరేకతను పెంచిందని పేర్కొంది.