Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జనసేన పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా?

మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:52 IST)

Widgets Magazine
chiru-pawan

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా? రాజకీయాల్లో అన్నాదమ్ముళ్లు ఏకం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు.. సినీజనం. ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించిన జనసేనాని.. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని తలచి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. 
 
అన్న పార్టీ గంగలో కలిసిపోయేందుకు గల కారణాలను కూడా వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నయ్యను పూర్తి స్థాయి సినిమాలు చేయమంటూనే.. జనసేనలో కీలక బాధ్యతలను పవన్ చిరంజీవికి అప్పగించే పనుల్లో వున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నయ్య, తమ్ముడు ఇద్దరూ కలిసి పోటీ చేస్తారని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 
 
సోషల్ మీడియాలోనూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను జనసేన ఏకం చేయనుందని టాక్ వస్తోంది. పీఆర్పీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. అధికారాన్ని సొంతం చేసుకోవడంలో విఫలమై.. ఆపై పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అటు పిమ్మట కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి పదవిని, ఎంపీగానూ కొనసాగారు. కానీ ప్రస్తుతం రాజకీయాలకు చిరంజీవి దూరంగా వుంటున్నారు.
 
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చిరంజీవి పాల్గొనేందుకు ఆసక్తి చూపట్లేదు. సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదని తెలుసుకున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపై చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవిని కూడా జనసేనలో కలుపుకోవాలని పవన్ కూడా సిద్ధంగా వున్నట్లు సమాచారం. అంతేగాకుండా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై పవన్ ఎప్పుడు ప్రకటన చేస్తారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆమెకు 16.. ఆయనకు 50.. ఫిరోజాబాద్‌లో బలవంతపు పెళ్లి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత యువతికి బలవంతపు వివాహం చేశారు. ఆ బాలిక వయసు 16 యేళ్లు ...

news

విజయ్‌కి హెచ్ఐవీ? మరో అమ్మాయితో సంబంధం వుందా?

ఆత్మహత్యకు పాల్పడిన వర్ధమాన నటుడు విజయ్‌కి హెచ్ఐవీ వుందని ఆయన భార్య వనిత (32) అలియాస్ ...

news

ప్రియుడితో గొడవపడి 15 అంతస్తుల భవనం నుంచి దూకేసింది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి ...

news

చంద్రబాబుది పాత మూసే.. జగన్‌ ఆ కేసులతో?: హరగోపాల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తరహా సినిమా నుంచి రాజకీయాల్లో వచ్చిన నేతలు ...

Widgets Magazine