మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (09:19 IST)

దేశంలో గంటకో విద్యార్థి చనిపోతున్నాడు.. ఎందుకు...

దేశంలో గంటకో విద్యార్థి చనిపోతున్నాడు. అదీ 18-25 యేళ్ళ మధ్య వయసున్న విద్యార్థులే కావడం గమనార్హం. గత ఐదేళ్లలో 40వేల మంది టీనేజర్ల బలవన్మరణాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. అంతేకాదండోయ్.. యువత ఆత్మహత్యలు

దేశంలో గంటకో విద్యార్థి చనిపోతున్నాడు. అదీ 18-25 యేళ్ళ మధ్య వయసున్న విద్యార్థులే కావడం గమనార్హం. గత ఐదేళ్లలో 40వేల మంది టీనేజర్ల బలవన్మరణాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. అంతేకాదండోయ్.. యువత ఆత్మహత్యలు భారత్‌లోనే కావడం గమనార్హం. 
 
తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక.. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించలేక.. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చదువులో రాణించినా.. మంచి ఉద్యోగం లేక.. ఉద్యోగం వచ్చినా మంచి అమ్మాయి దొరకక.. దొరికినా.. బంధాన్ని బలోపేతం చేసుకోలేక.. సతమతమవుతూ... ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూస్తూ.. ఆందోళన చెందుతూ.. చివరకు కుంగుబాటులో కూరుకుపోయి.. ఆత్మహత్య చేసుకుంటున్నారు. 
 
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతలోనే ఎక్కువ మంది యువత చనిపోతున్నారు. దేశంలో గంటకో విద్యార్థి తనువు చాలిస్తున్నాడు. ఈ మేరకు జాతీయ నేర గణాంక విభాగం 2015 వార్షిక లెక్కలు వెల్లడించాయి. కాగా.. ఆడిపాడే వయసులో ఆత్మహత్యలు పెరగడానికి కుటుంబాలే కారణమని మానసిక నిపుణులు, అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యలే కుంగుబాటుకు అసలు కారణమని వివరించాయి.
 
దేశవ్యాప్తంగా లక్షకు దాదాపు పది వరకు ఆత్మహత్య చేసుకుని చనిపోతోంటే.. ఈ రేటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఏపీ తెలంగాణల్లో లక్షకు 15 మంది వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలోనూ 14-30 ఏళ్ల మధ్య యువతే ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోల్చినపుడు తెలుగు రాష్ట్రాల్లో యువత ఆత్మహత్యలు తక్కువగా కనిపించినా.. ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. 
 
ఇదీ తీరు... 
ఆత్మహత్య చేసుకుంటున్న యువత ఏటా దాదాపు 9000 మంది
ఐదేళ్ళలో తనువు చాలించిన వారి సంఖ్య 40 వేల మంది
మొత్తం ఆత్మహత్యల్లో యువత వాటా 40శాతం
 
కారణాలు
పరీక్షల్లో ఫెయిల్‌ కావడం
కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలు
నిరుద్యోగం, కుటుంబ సమస్యలు
కెరియర్‌లో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు
రిలేషన్స్‌పై అవగాహన లేకపోవడం
తల్లిదండ్రులతో పూర్‌ రిలేషన్‌ షిప్‌
 
డాక్టర్లూ తక్కువే...
అందుబాటులో మానసిక నిపుణులు 14 శాతం
దేశంలో సైక్రియాట్రిస్టుల.. 4000 మంది
సైకాలజిస్టులు 1000 మంది
కొరత.. 65 వేల మంది