Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తితిదే ఛైర్మన్‌గా మాజీ సీఎం కిరణ్‌ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి?

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:22 IST)

Widgets Magazine
kiran kumar reddy

నల్లారి కుటుంబం తెలుగుదేశం పార్టీలో దాదాపు ఖాయమైంది. మొదటగా అనుకున్న విధంగా తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని పంపిన తర్వాతనే తాను పార్టీలోకి అడుగుపెట్టాలన్నది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా ఉంది. అదేవిధంగా పావులు కదుపుతున్నారు. అయితే కిషోర్ పార్టీలోకి పోవడం ఖాయమైంది. అయితే, గొంతెమ్మ కోర్కెలతో ముందుకు వెళుతుంటే అసలు బాబు వీరిని తీసుకుంటారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. అయితే చినబాబు లోకేష్‌ మాత్రం వీరు పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారట. 
 
మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్ళి చతికిలబడ్డారు. కానీ ఆ తర్వాత పార్టీకి, ప్రజలకూ దూరమైపోయి బెంగుళూరుకు వెళ్ళిపోయారు. అక్కడే తనకు ఉన్న వ్యాపారాలను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ గత కొన్నినెలలుగా ఏదో ఒక పార్టీలో చేరాలన్న బలమైన ఆలోచనలో ఉన్న కిరణ్‌ అన్ని పార్టీలతో మంతనాలు చేయడం మొదలెట్టారు. అయితే చివరకు ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశంలోకి చేరాలన్న ఆలోచనకు వచ్చినట్టు ఉన్నారు. 
 
కానీ మొదటగా తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని పంపడానికి మంతనాలు జరిపారు. అన్ని అయిపోతుందనుకుంటున్న తరుణంలో కిషోర్ ఒక మెలిక పెట్టాడు. తాను వెళ్ళాలంటే టిటిడి ఛైర్మన్ పదవి కావాలని. ఈనెల 27వ తేదీకి చదలవాడ కృష్ణమూర్తి బోర్డు పదవీ కాలం ముగుస్తుంది. ఆ పదవి సంవత్సరం పాటు ఇవ్వాలన్న ప్రతిపాదనను పెట్టాడట. అయితే ఇప్పటికే ఈ పదవి కోసం క్యూలైన్లలో ఉన్న కొంతమందిని కాదని బాబు ఇస్తారా లేదా అన్నది అనుమానం. అయితే ఆ  పదవి ఎట్టి పరిస్థితుల్లో కావాలని చిన్నబాబు లోకేష్‌ ద్వారా మంతనాలు జరుపుతున్నారట కిషోర్. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీటీవీ దినకరన్ ఒక్కో ఆకుకి రూ.25 కోట్లు, ఈసీకే లంచం ఇవ్వబోయాడు... ఇప్పుడు పారిపోయాడు...

తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ ...

news

మాజీ మంత్రి బొజ్జల ఎందుకు మారిపోయారు...?

మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటగా అధినేతపై తిరుగుబావుటా ఎగురవేసి ఎమ్మెల్యే పదవికి కూడా ...

news

అవును పవన్‌కు వీరాభిమాని.. కాటమరాయుడిని 9సార్లు చూశా: వైసీపీ ఎమ్మెల్యే

యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఆసక్తికర ...

news

దినకరన్‌కు డెడ్‌లైన్.. 18లోపు తప్పుకోవాలి.. లేదంటే బహిష్కరణే.. అత్త వద్దకు అల్లుడు పరుగులు

అన్నాడీఎంకేలో మళ్లీ అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీతో పాటు... తమ భవిష్యత్ ...

Widgets Magazine