Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్త నాకిచ్చింది.. నన్నెవరూ పీకలేరు... టీటీవీ దినకరన్

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:00 IST)

Widgets Magazine

తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కథ గుర్తుకు వస్తుంది. టామ్ అండ్ జెర్రీలకు ఒక్క నిమిషం కూడా పడదు. ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితే తమిళనాడులో కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి పదవి కోసం కొంతమంది చేస్తున్న ఫీట్లు అలాంటిది. జయలలిత మరణం, శశికళ జైలుకు వెళ్ళడం తర్వాత అన్నాడిఎంకే మూడు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. పన్నీరుసెల్వం, పళణిస్వామి, దినకరన్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యారు. 
 
రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక దినకరన్ జైలుకు వెళ్ళిన తరువాత అన్నాడిఎంకేలోని పళణి, పన్నీరులు కలిసిపోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పన్నీరుసెల్వం రెండు షరతులకు పళణిస్వామి అంగీకరించక పోవడంతో అది కాస్త ఆగిపోయింది. మొదటి షరతు శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి పంపేయాలి, రెండవది జయలలిత మరణంపై విచారణ జరిపించాలి. అయితే ఇందుకు పళణిస్వామి ఒప్పుకోకపోవడంత ఇద్దరూ చర్చలు మానుకున్నారు.
 
ఇది జరుగుతుండగానే దినకరన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. రాగానే పార్టీపై దృష్టి పెట్టాడు. పార్టీలో ఇప్పటికే తనకున్న ఉప ప్రధాన కార్యదర్శి పదవితో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశాడు. దీంతో పళణిస్వామికి భయం పట్టుకుంది. ఉన్న ముఖ్యమంత్రి పదవికి దినకరన్ ఎసరు పెడుతున్నాడని గమనించి మళ్ళీ పన్నీరుసెల్వంతో చర్చలు ప్రారంభించాడు. ఇప్పుడు పన్నీరుసెల్వం చెప్పినట్లు దినకరన్, శశికళను పార్టీ నుంచి పూర్తిగా సాగనంపే ప్రయత్నం ప్రారంభించారు.
 
అత్యవసరంగా గురువారం అన్నాడిఎంకే ముఖ్య నాయకులతో సమావేశమైన పళణిస్వామి దినకరన్ నియామకం చెల్లదని, పార్టీకి సంబంధించి ఆయన ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తీర్మానించారు. ఇదికాస్త దినకరన్‌కు కోపం తెచ్చిపెట్టింది. ఉప ప్రధాన కార్యదర్శి నుంచి తొలగించడానికి మీరు ఎవరని, మా మేనత్త నాకిచ్చిన పదవి ఇది.. నన్నెవరూ పీకలేరంటూ నియామక పేపర్లను మీడియాకు చూపించారట. మొత్తం మీద పళణి, పన్నీరు, దినకరన్‌లకు మధ్య జరుగుతున్న హైడ్రామా తమిళనాడు రాజకీయాల్లో రసవత్తరంగా మారుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Warn Ttv Dinakaran Surgical Action Cm Palaniswami O Panneerselvam Aiadmk Merger Live

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిన్నటివరకు న్యాయవాది.. నేడు న్యాయమూర్తి.. వెంకయ్య తెలుగు స్పీచ్ ఓ ఎక్స్‌ప్రెస్ : మోడీ

రాజ్యసభలో నిన్నటివరకు వివిధ సమస్యలపై ఓ న్యాయవాదిగా వాదించి, వాదాడిన వెంకయ్య నాయుడు ఇపుడు ...

news

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణస్వీకారం... 'మాట్లాడాలా?' అని అడిగితే.. వద్దనడంతో సీట్లోకి!

దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ...

news

పన్నీరుసెల్వంకు ఉపముఖ్యమంత్రి పదవి లేనట్లే..

పన్నీరుసెల్వం - పళణిస్వామిలకు మధ్య జరుగుతున్న రసవత్తర చర్చలో పన్నీరుకే ఎక్కువ నష్టం ...

news

నాకు తెలుసు.. ఎప్పుడు... రావాలో.. నన్ను ఇబ్బంది పెట్టొద్దండి

విశ్వవిఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ రంగప్రవేశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రజినీకాంత్ ...

Widgets Magazine