Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని అనుకోవచ్చా?

శనివారం, 8 జులై 2017 (23:10 IST)

Widgets Magazine

ఆయనను చూస్తుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. ఆయన మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఏదో తెలియని అయస్కాంత శక్తి వుందా అన్న అనుమానం కలుగుతుంది. ఏ న్యూస్ మీడియా కూడా ఆయనను కవరేజ్ చేయకుండా వుండదు. చెప్పాలంటే దేశంలో ఏ ప్రధాని కూడా అంతటి పాపులారిటీని కలిగి లేరేమోనని అనిపిస్తుంది. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకోవచ్చా? ఐతే ఇలా సమాధానానికి రావాడం అంత సులభం కాదు.
Narendra Modi
 
ఒకవేళ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వుంటే సోషల్ మీడియా ప్లాట్‌పార్మ్స్‌ను ఎలా వాడుకునేవారో తెలియదు. వాళ్లకు ఎంతమంది ఫాలోవర్లు వుండేవారో? వారు తమ అభిప్రాయాలను ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఎంతమేరకు షేర్ చేసుకునేవారో? మిగిలిన సెలబ్రిటీలనందరినీ వెనక్కి నెట్టేందుకు ఈ విషయంలో వాళ్లేం చేసేవారో? తిట్ల పురాణంతో కొందరు బాగా పాపులర్ అవుతారు. పాపులారిటీ బాగా ఒక్కసారిగా పెరిగిపోవాలంటే ఏదో చెడ్డ చేస్తే వచ్చేస్తుంది. అదే మంచి పనులు చేస్తూ తిరుగులేని ప్రజాదరణ పొందడం అంటే ఈ రోజుల్లో మాటలా? అదీ సోషల్ మీడియాలో... 
 
నరేంద్ర మోదీకి 18 లక్షల మంది యూజర్లు ట్విట్టర్లో వున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాయకులను చూసినప్పుడు ఆయనది రెండో స్థానం. ఏదయినా చెప్పాలనుకుంటే క్షణాల్లో 18 లక్షల మందికి సందేశం ఇచ్చేయవచ్చు. గాంధీజీ కాలంలో ఆయన చెప్పదలుచుకున్నది ప్రజలకు చేర్చాలంటే వేలల్లోనే జనం వుండేవారు. అంతా ఒక్కచోట గుమికూడి గాంధీజి సందేశం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఐతే గాంధీజీకి ఆనాడు పెద్దగా వార్తా సాధనాలు లేకపోయినా, ఆయన పాపులారిటీ ఇప్పటికీ అలాగే సాగుతోంది.
 
1952 ఎన్నికల సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఓటర్లను చేరుకుని తన సందేశాన్నిచ్చేందుకు రోడ్డు మార్గాల ద్వారా పర్యటన చేసేందుకు కాస్త ఇబ్బందిపడ్డారు. ఐతే ప్రజల్లోకి వెళ్లాక అవన్నీ పటాపంచలయ్యాయి. మొత్తమ్మీద ఆనాడు 1952లో జవహర్ లాల్ నెహ్రూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మళ్లీ అలాంటిదే 62 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ చేస్తున్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఆయన పాపులారిటీని ఎవ్వరూ ఆపలేకపోయారు. ప్రధానిగా కొద్దికాలమే ఆయన వున్నప్పటికీ మంచి ఆదరణ లభించింది. ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటూనే వుంటారు.
 
పాకిస్తాన్ దేశంపైన 1965లో విజయం ఆయనకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. అలాగే 1971లో శ్రీమతి ఇందిరా గాంధీ ఘన విజయానికి కూడా పాకిస్తాన్-బంగ్లాదేశ్ యుద్ధం ఒక కారణమైంది. ఐతే ఎమర్జెన్సీతో ఆమె పట్ల వ్యతిరేకత వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇందిరా గాంధీ పాపులారిటీ ప్రజల్లో ఇంకా అలాగే వుంది.  
 
ఇక రాజీవ్ గాంధీ రాజకీయాల్లో యంగ్, ఎనర్జటిక్, నూతన వరవడితో భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన ప్రధాని. ఐతే 1989కి వచ్చేసరికి షా బానో కేసు, రామ్ లాల్ మండల్ కమిషన్, బోఫోర్స్ కుంభకోణం ఆయన పాపులారిటికీ మచ్చను తెచ్చాయి. దాంతో మునుపటి పాపులారిటీని ఆయన సంపాదించుకోలేకపోయారు. 
 
భాజపా నుంచి అటల్ బిహారీ వాజ్‌పాయ్ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగానూ, ప్రధానిగానూ ప్రతిపక్షాలను తన మాటల చాతుర్యంతో ఇరుకునపెట్టే నాయకుడిగానూ పేరొందారు. ఆయన భారత ప్రధానిగా మూడుసార్లు పదవిని అలంకరించారు. రెండుసార్లు అతి తక్కువ కాలానికే అంటే 13 రోజులు, 13 నెలల పాటు మాత్రమే పనిచేశారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఐదేళ్ల పూర్తి కాలాన్ని ప్రధానిగా సాగించారాయన.  
 
అటల్ బిహరీ వాజ్‌పాయ్‌కి భిన్నంగా నరేంద్ర మోదీ పూర్తి మెజారిటీతో భాజపా నుంచి విజయం సాధించారు. ఇవాళ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భాజపా అధికారంలో వుంది. ఇటీవలే బంపర్ మెజారిటీతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఈ కాలంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు కూడా అసాధారణమైనవి. నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, జిఎస్టీ బిల్లుతో పాటు ఇజ్రాయిల్ పర్యటన. 2002లో ఏం జరిగిందో ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలని ఎవరూ అనుకోవడంలేదు. దేశానికి అవసరమైనది ఏమిటో మోదీ సృష్టించారు. అదే పెద్ద విషయం. అలాగని నరేంద్ర మోదీ అన్నివేళలా గొప్పవాడని అనుకోలేకపోవచ్చు. కానీ 2019 ఎన్నికల విజయం అనంతరం ఆయన పాపులారిటీ సుస్పష్టం. 2019 ఎన్నికల విజయం ఎలా అన్నది ఆయన దృష్టిలో ఇప్పటికే వుండనే వుంది మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

మీరు చెప్పారు

Loading comments ...

తెలుగు వార్తలు

news

సూది మందంటే చచ్చేంత భయమంటున్న సీఎం సాబ్ ఎవరు?

ఆయన ఒక పార్టీకి అధినేత. రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందరో రాజకీయ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన ...

news

జాతీయ జెండాను రివర్స్‌ ఎగిరేసిన కలెక్టర్...

ఒక జిల్లా కలెక్టరే జాతీయ జెండాను అవమానించారు. దేశసార్వభూమాధికారాన్ని ప్రజలందరికీ ...

news

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. ...

news

మా భర్తలు తాగాలి... వైన్ షాప్ ఇక్కడే ఉంచండి...!

భర్త రోజు తాగొచ్చి గొడవ చేస్తే దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదు. మద్యం సేవించే భర్త అంటే ...

Widgets Magazine