1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (12:41 IST)

ఆర్టికల్ 370 అంత డేంజరా? నెహ్రూ గారు ఇచ్చిన చేదు బహుమతి?

ఆర్టికల్370 ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఆర్టికల్ 370 చాలా డేంజర్ అని అంటున్నారు. ఇది భారతీయులకు నెహ్రూగారి చేదు బహుమతి. అదేంటంటే? జమ్మూకాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం వుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో జాతీయ పతాకం భిన్నంగా వుంటుంది. కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు. మిగితా భారతదేశ సంగతికి వస్తే ఐదేళ్లు మాత్రమే. 
 
జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు. కానీ భారతదేశ పతాకాన్ని అవమానిస్తే నేరంగా పరిగణిస్తారు. ఇంకా జమ్మూ కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు.
 
భారత పార్లమెంటు నిబంధనల విషయంలో చాలా పరిమిత స్థలాలలో చట్టాలు చేయవచ్చు. ఒక కాశ్మీరి మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ మహిళకు కాశ్మీరీ పౌరసత్వం ముగుస్తుంది 
 
కానీ కాశ్మీరి మహిళ పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ - కాశ్మీర్ పౌరసత్వాన్ని అతడు పొందుతాడని చట్టం వుంది. 
 
ఇందుకు కారణంగా 370. దీనివల్ల కాశ్మీర్‌లో సమాచార హక్కు వర్తించదు. ఆర్టీఐ అమలు చేయబడలేదు. కాగ్ వర్తించదు. భారత చట్టాలు వర్తించవు.  షరియా చట్టం కాశ్మీర్లో మహిళలకు వర్తిస్తుంది. విభాగం 370 కారణంగా ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు. 
 
370 సెక్షన్ల వలన పాకిస్థానీయులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఇందుకు కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే సరిపోతుంది. విభాగం 370ను తీసివేయడం మంచిదేనని ప్రస్తుతం సానుకూల స్పందన వస్తోంది. కానీ దీన్ని రద్దు చేయడం ద్వారా భూ ఆక్రమణలు పెరిగిపోతాయనే వాదన వుంది.

సెక్షన్ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్‌లో ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్-బీజేపీల మధ్య పెద్ద వారే జరుగుతోంది.