బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (18:32 IST)

టీడీపీతో పొత్తు.. సీట్ల కష్టాలొద్దు మహా ప్రభూ...

pawan  -  babu
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి దయనీయంగా మారింది. సీట్ల విషయంలో తప్ప మిగిలిన విషయాలపై పవన్‌తో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇది జనసేనకు ఇష్టం లేదు. చంద్రబాబులో నిజమెంతో తేలిపోతుందని, చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతుందని జనసేన నేతలు భయపడుతున్నారు. ఇదే సందర్భంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రాజకీయం అంటే ఇదేనా? అని పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను, చంద్రబాబు కలిసి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. సీఎం కథ ఎవరిది, ముందుగా ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తారనే విషయాలపై క్లారిటీ ఇస్తేనే రెండు పార్టీలకు లాభం చేకూరుతుందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా జరగకపోతే.. మొదటికే మోసం వస్తుందని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
 
జనసేనకు వచ్చే సీట్లపై మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు జనసేనకు కనీసం 30 సీట్లు వస్తాయని ప్రచారం జరిగింది. మరోవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూకుడు మీదున్నారు. అక్కడక్కడ మార్పులు చేర్పులు చేశారు. 
 
అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీతో పొత్తుకు తమ పార్టీ శ్రేణులు అంగీకరించడం లేదని, అయితే సీట్ల విషయంలో క్లారిటీ ఇస్తేనే ఒకరికొకరు ఓట్లు మార్చుకునే అవకాశం ఉంటుందని, లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.