Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదీపై మాటలు తూటాలు పేలుస్తున్న పవన్ కళ్యాణ్... చిరంజీవికి కష్టాలు తప్పవా?

శనివారం, 20 మే 2017 (14:08 IST)

Widgets Magazine

ఎందుకో కానీ రూమర్లు అలా తిరుగుతుంటాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ రాజకీయ నాయకులపై జరుగుతున్న ఐటీ, సీబీఐ దాడుల నేపధ్యంలో అంతా కేంద్రంలో పగ్గాలు చేపట్టిన భాజపాను చూపిస్తున్నారు. భాజపా తమకు ఎదురుతిరుగుతున్న పార్టీలను లేవకుండా చేసేందుకు ఇలాంటి దాడులు చేయిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. 
pawan-modi
 
ఇటీవలే తమిళనాడులో కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం పైన జరిగిన సీబీఐ దాడులు తమపై కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం చిక్కినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భాజపాను జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఉత్తరాది అహంకారం అంటూ పెద్దపెద్ద మాటలు ప్రయోగిస్తున్నారు. ఈ మాటలను ఎవరిని అంటున్నారో వేరే చెప్పక్కర్లేదు. 
 
కానీ ప్రధానమంత్రి మోదీ మాత్రం పవన్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు. మిత్రుడు కదా... ఏదో అలా మాట్లాడుతున్నారు, స్నేహితుల మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తప్పవని మిన్నకుంటున్నారేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐతే తమిళనాడులో జరుగుతున్నవి చూసినప్పుడు ఏదో ఒకరోజు... పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ తనకంటూ పోగేసుకున్న ఆస్తి ఏదీ లేకపోవడంతో ఆయనపైకి వెళ్లినా లాభం లేదని అనుకుంటున్నారట. 
 
కనుక పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు గురించి ఆరా తీసి వ్యవహారాన్నంతా లోతుగా చూస్తే సరిపోతుందని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే... పవన్ కళ్యాణ్‌ను డైరెక్టుకు ఏమీ చేయలేక మెగాస్టార్ చిరంజీవిని ఆయుధంగా వాడుకోవాలని వారు చూస్తున్నారని అంటున్నారు. 
 
రాబోయే ఎన్నికల సమయానికి తమ మాట వింటే సరే... లేదంటే ఆయుధాలను వాడుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తను వేటికీ భయపడననీ మొండిగా చెప్పేశారు. కాబట్టి పవన్ అన్నిటికీ తెగించి సిద్ధంగా వున్నారు కనుక ఎవ్వరికీ భయపడరని అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడు సార్లు ఎమ్మెల్యేనయ్యా.. మర్డర్లు చేస్తామా? : గొట్టిపాటి రవికుమార్

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షల్లో ...

news

'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' : గొట్టిపాటికి కరణం సవాల్

తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ...

news

బెడ్రూంలో 'ఆ' ప్రాక్టికల్స్... తరగతి గదిలో కెమిస్ట్రీ పాఠాలు.. 17 యేళ్ళ విద్యార్థితో 35 యేళ్ళ టీచరమ్మ రొమాన్స్

విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ.. తాను మనసుపడిన విద్యార్థికి ఏకంగా ...

news

సవతి కుమార్తెపై కరాటే మాస్టర్ (తండ్రి) లైంగిక దాడి... చితక్కొట్టిన స్థానికులు... ఎక్కడ?

కామంతో కళ్ళుమూసుకుని పోయిన కామాంధులకు వావివరుసలు, కన్నబిడ్డలు అనే విషయం కూడా గుర్తుకు ...

Widgets Magazine