1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:36 IST)

జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ... పేరు నవభారత్ నేషనల్ పార్టీ...

టాలీవుడ్ యువ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నందమూరి వంశ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. జూనియర్ అధికారం కోసమో.. లేక చంద్రబాబుపై ఉన్న కోపమో ఏమో గానీ సొంతంగా ఒక పార్టీ ప

టాలీవుడ్ యువ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నందమూరి వంశ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. జూనియర్ అధికారం కోసమో.. లేక చంద్రబాబుపై ఉన్న కోపమో ఏమో గానీ సొంతంగా ఒక పార్టీ పెట్టేశారు జూనియర్ ఎన్‌టిఆర్. నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో పార్టీకి రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసింది. అయితే జూనియర్ ఎన్‌టిఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సిన అవసరమొచ్చిందో ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకే అర్థం కావడం లేదట.
 
నందమూరి తారకరామారావు. తాత పేరునే తన పేరుగా పెట్టుకున్నారు జూనియర్ ఎన్‌టిఆర్. రాజకీయాలపై పెద్దగా ఇంట్రస్ట్‌లేని జూనియర్ ఎన్టీఆర్ మామ చంద్రబాబు కోసం గత కొన్ని సంవత్సరాల ముందు ప్రచారం కూడా చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ గురించి, తాతయ్య గొప్పతనం గురించి వివరించాడు. అయితే అప్పట్లో పార్టీ ఓడిపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం మంచిపేరే వచ్చింది. 
 
అప్పట్లో జూనియర్‌ను బాగా దగ్గర చేర్చుకున్న చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నారని విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత మామకు టిడిపికి దూరంగా ఉంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపైనే ఎక్కువగా శ్రద్ధచూపించారు. అయితే గత కొన్నినెలల ముందు సొంతంగా ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచనతో దరఖాస్తు చేసుకోగా నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో పేరు రిజిస్ట్రరయ్యింది.
 
అదికూడా ఈనెల 11వ తేదీన నేరుగా హైదరాబాద్‌లోని జూ.ఎన్టీఆర్ ఇంటికి కొరియర్ ద్వారా లేఖ కూడా వచ్చింది. దీన్ని చదివిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారట. ముందుగా జూనియర్ తండ్రి హరికృష్ణ. ఏంటిబాబు ఇది అని ప్రశ్నించారట. అయితే దీనికంతా తర్వాత సమాధానం చెబుతానని జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ప్రస్తుతం జూనియర్ కొత్త పార్టీ పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.