శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj

ప్రధానిని కలిసిన లక్ష్మీపార్వతి - బాబుకు కౌంట్‌డౌన్ స్టార్ట్

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు సతీమణి లక్ష్మీపార్వతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వైకాపా గురించి ప్రధానికి వివరించారు. గత నెలరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే అపాయింట్మెంట్ దొరక్కుంటే

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు సతీమణి లక్ష్మీపార్వతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వైకాపా గురించి ప్రధానికి వివరించారు. గత నెలరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే అపాయింట్మెంట్ దొరక్కుంటే లక్ష్మీపార్వతికి ప్రధాని మాట్లాడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చంద్రబాబునాయుడు ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ప్రధాని దృష్టికి లక్ష్మీపార్వతి తీసుకెళ్ళారట. 
 
గత ఎన్నికల్లో బీజేపీ - తెదేపా కలిసే పనిచేశాయి. అందుకే ఏపీలో తెదేపా విజయం సాధించింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌ సహకారం బాబుకు బాగా కలిసొచ్చింది. అయితే మూడు సంవత్సరాల తరువాత టిడిపి, బిజెపిల మధ్య బిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రధాని చంద్రబాబు నాయుడుతో సరిగ్గా మాట్లాడడం లేదని, అందుకు ప్రధాన కారణం వైసిపి అధినేత జగన్ కలవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశం ఉందని తెలియడంతో ప్రధాని ఆ పార్టీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగినా అందుకు సమయం ఉంటుంది. అలాంటిది ఇప్పటి నుంచే ప్రధాని చంద్రబాబు నాయుడు దూరం పెట్టడం మాత్రం చర్చకు దారితీస్తోంది. దాంతో పాటు లక్ష్మీపార్వతి ప్రధానిని కలవడం మరోసారి టిడిపి పార్టీ ఎదురుదెబ్బలాగా కనిపిస్తోంది.