1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 27 జులై 2016 (14:57 IST)

3 ప్యాంట్లు, 6 షర్టులు, 3 సూట్లు, 1 వాచ్, 2,500 పుస్తకాలు, 123 కోట్ల భారతీయుల ప్రేమ... కలాం ఆస్తి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతి సంద‌ర్భంగా రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన స్వస్థలమైన పేయ్‌కరుంబు ప్రాంతంలో బుధవారం కేంద్రమంత్రులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలాంకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్‌ తదితరు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతి సంద‌ర్భంగా రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన స్వస్థలమైన పేయ్‌కరుంబు ప్రాంతంలో బుధవారం కేంద్రమంత్రులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలాంకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్‌ తదితరులు నివాళులర్పించారు. మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత అబ్దుల్ కలామ్ కాలం చేసి అప్పుడే ఏడాది పూర్తయ్యింది. ఆ మహానుభావుడి జ్ఞాపకాలు మాత్రం ఇంకా మన మనసుల్లో పదిలంగానే ఉన్నాయి. భారతీయుల హృదయాల్లో అబ్దుల్ కలామ్ స్ఫూర్తి నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయన చిత్తశుద్ధి, పట్టుదల, కార్యదక్షత.. అంతకుమించి దేశమంటే ఆయనకున్న అపారమైన ప్రేమ ఉండ‌డం వ‌ల్ల ఒక‌ తరాన్ని మేల్కొలిపిన స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలామ్.
 
* ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన సెక్రటరీగా పనిచేసిన పీఎం నాయర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ విషయాలు తెలుసుకుంటే కలామ్ పైన ఉన్న అభిమానం రెండింతలు అవుతుంది. డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారని అది మన దేశాన్ని ఇరకాటంలో పెడుతుందని వాటిని తీసుకునేవారు. ఇండియా తిరిగి రాగానే వాటిని ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారుచేయించి అన్నీ ఆర్కైవ్స్‌లో భధ్రపరిచేవారు. ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలో నుండి తనతో తీసుకువెళ్ళలేదు.
 
* 2002లో రంజాన్ సంద‌ర్భంగా రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వాలి. ఒక రోజు కలాం గారు ఆయ‌న‌ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని అన్నారు. " బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి దుస్తులు, ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాధాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు. " ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి " అన్నారు.
 
* రాష్ట్రపతిగా ఆయన రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసే సమయంలో ఆయన ఆస్తి వివరాలు.. 3 ప్యాంట్లు, 6 షర్టులు, 3 సూట్లు, 1 వాచ్, 2,500 పుస్తకాలు, ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్, 123 కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.
 
* కలాం గారు ఒకసారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్‌కు అతిథులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికి అయిన ఖర్చును ఆయనే చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది. ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు.