Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమర్శలు.. పొగడ్తలు : పెద్ద నోట్ల రద్దుకు యేడాది

బుధవారం, 8 నవంబరు 2017 (08:30 IST)

Widgets Magazine
old notes

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం ప్రకటించి బుధవారానికి సరిగ్గా యేడాది పూర్తికానుంది. కీలకమైన ఈ అడుగు తర్వాత దేశవ్యాప్తంగా కనిపించిన ప్రభావంపై అధికార, విపక్షాల్లో భిన్నరకాల వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. నవంబరు 8వ తేదీని నల్లధనం వ్యతిరేకదినంగా పాటించాలని బీజేపీ పిలుపునిస్తే, దేశవ్యాప్తంగా నిరసనదినం నిర్వహించాలని ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నిర్ణయించింది. 
 
రూ.500, రూ.1000 విలువైన నోట్లను 2016 నవంబరు 8వ తేదీన రద్దు చేయడం వల్ల పెద్ద నోట్ల చలామణీ తగ్గడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే వ్యవస్థలో పెద్దనోట్లు ఎంతగా పెరిగిపోయి ఉండేవో వివరించింది. దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఏడాది క్రితం తీసుకున్నది ఎంతో కీలకమైన నిర్ణయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కొనియాడారు. 
 
ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రవాహం నిలిచిపోయేందుకు, కాశ్మీర్‌లో సైనికులపై రాళ్లదాడి ఆగిపోవడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదపడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. డిజిటల్‌ చెల్లింపుల రెండో దశ ప్రోత్సాహానికి ప్రచారాన్ని వచ్చే జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
అయితే, విపక్షనేతలు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. నోట్లరద్దు అనేది నల్లధనాన్ని సక్రమ నగదుగా మార్చుకునేందుకు ఉద్దేశించిన పెద్ద కుంభకోణంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఘాటైన విమర్శలు చేశారు. 
 
మరోవైపు, ‘ఇండియా సఫర్స్‌’ పేరుతో బుధవారం(నవంబర్-8) పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసింది. గత ఏడాది ప్రధాని కీలక ప్రకటన చేసిన సమయాన్ని గుర్తు చేసేలా రాత్రి సరిగ్గా 8 గంటలకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో వ్యాపార వర్గాలతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్యారడైజ్ పేపర్ల కథనాలపై జగన్ సమాధానం చెప్పాల్సిందే... మంత్రి కళావెంకట్రావు

అమరావతి: ప్యారడైజ్ పేపర్లలో జగన్ పైన వచ్చిన కథనాలపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ...

news

సీనియర్ నరేష్ సంచలనం... పవన్ వస్తే ఎన్టీఆర్ పాలనే, కమల్ హాసన్ అయితే...

సీనియర్ నరేష్ సంచలన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ ...

news

పార్టీ ఎందుకు మారానా అని తల బాదుకుంటున్న ఎమ్మెల్యే..

వైసిపి నుంచి టిడిపిలోకి చేరారు 22 మంది ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష పార్టీలో వుండి ఏమీ చేయలేమని ...

news

ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తాడనే భయం.. అందుకే జగన్ పాదయాత్ర: సోమిరెడ్డి

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ...

Widgets Magazine