1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (16:30 IST)

ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ ఎంత ఖర్చు చేయాలి? పవన్‌ను దేవుడిగా ఎందుకు పూజిస్తారంటే?

టాలీవుడ్‌‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే లగ్జరీ కార్లు పెట్టుకుని.. హ్యాపీగా విలాసవంతమైన జీవనం గడపాల్సిన పవన్ కల్యాణ్.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో సింపుల్ హౌస్‌ను

టాలీవుడ్‌‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే లగ్జరీ కార్లు పెట్టుకుని.. హ్యాపీగా విలాసవంతమైన జీవనం గడపాల్సిన పవన్ కల్యాణ్.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో సింపుల్ హౌస్‌ను నిర్మించుకున్నారు. ఇప్పటికే తన సొంత ఊరు మొగల్తూరులో పవన్ కల్యాణ్ సొంతిల్లు కలిగివున్నారు.

అయితే హైదరాబాదులో ఉన్న ఇంటిని పవన్ కల్యాణ్ సింపుల్‌గా నిర్మించారు. ఇందులో 3 బెడ్ రూములు, రెండు హాల్స్, మిని థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి వున్నా.. పవన్‌లో సింపుల్‌సిటీకి ఈ ఇల్లే నిదర్శనమవుతుంది. అయితే ఈ రెండు ఇళ్ళున్నా.. పవన్ కల్యాణ్ టైమ్ దొరికినప్పుడల్లా ఫామ్ హౌస్‌లో రెస్టు తీసుకుంటుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆస్తుల గురించి పెద్దగా చర్చ సాగుతోంది. 
 
సాధారణంగా లగ్జరీ లైఫ్‌ను అనుభవించే వారి జాబితాలో సినిమా హీరోలు కూడా ఉంటారు. కోట్ల పారితోషికం తీసుకుంటూ పెద్దపెద్ద బిల్డింగ్‌లు.. కోట్లు విలువ చేసే కార్లు, ఇంటినిండా సెక్యురిటీ.. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఇందుకు మినహాయింపు. పవన్ ఇతర హీరోల్లాగా ఎలాంటి రిచ్ లైఫ్ కోరుకోరని చెప్పాలి. దీనిపై నేషనల్ మీడియా కూడా అప్పట్లో కథనం రాసింది. 
 
ప్రస్తుతం నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కల్యాణ్.. ''నా దగ్గర డబ్బు లేదు, మీరు నా సినిమాలు చూస్తేనే నాకు డబ్బు వస్తుంది'' అని చెప్పారు. ఇందుకు కారణం.. జనసేన పార్టీ కోసం పవన్ ఎలాంటి ఫండ్స్ ఆర్జించలేకపోవడమే. ఎన్ని సభలు పెట్టినా వాటి ఖర్చు కోసం తన సొంత డబ్బును మాత్రమే పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తాడు. 
 
అంతేగాకుండా ఎవరైనా బాధల్లో ఉంటే చూస్తే ఉండే గుణం పవన్‌కి లేదట. తన వద్ద ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడట. దీనితో సామాజిక సేవల కోసం ఆయన పెద్దమొత్తంలో తన పారితోషికాన్ని ఉపయోగిస్తున్నట్టు తేల్చింది నేషనల్ మీడియా. ఇందుకే పవన్ కోట్ల పారితోషికం తీసుకున్నా.. ఆయన ఉద్యోగులకు జీతాలకే అవి సరిపోతాయట. ఈ  కారణంతోనే చిత్ర పరిశ్రమలో పవన్‌ను దేవుడిగా పూజిస్తారు.
 
పేదల కోసమే ప్రతి పైసాను ఖర్చు పెట్టే నేత పవన్ కల్యాణ్. తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆల్బమ్, పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఉద్యమానికి పవన్ కల్యాణ్ భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత డబ్బు కోసం పవన్ ఎంత కష్టపడతాడోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాట జరిగిన జల్లికట్టు ఉద్యమం కోసం కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్‌కు మద్దతుగా ఎంతమంది టాలీవుడ్ హీరోలు చేతులు కలుపుతారో వేచి చూడాలి.