శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (08:00 IST)

శుక్ర గ్రహంపై పాగా వేసేద్దాం.. తేలే కాలనీల్లో శాశ్వత నివాసం

భూ భారం పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతోందనడంలో అనుమానం లేదు. ఇక్కడ మనుషులు ఉండడానికి వీల్లేని స్థితి ఏర్పడితే ఏం చేద్దాం... ఈ ప్రపంచ ప్రపంచ శాస్త్రవేత్తలను తెగ పీడిస్తోంది. అందుకే ఆకాశంవైపు చూస్తూ కొత్తగా కనిపించే నక్షత్రాలలో మార్గం దొరకపోతుందా అని వెతుకుతున్నారు. అయితే నాసా శాస్త్రవేత్తలు పాత గ్రహం శుక్రుడిపై కన్నేసి అక్కడ మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తేలుతూ, తూలుతూ అక్కడ బతికేయవచ్చునని చెబుతున్నారు. ఆ విశేషాలు ఏమిటో.. 
 
నాసాకు చెందిన స్పేస్ మిషన్ అనాలిసిస్ విభాగ పరిశోధకులు డేల్ ఆర్నీ, క్రిస్ జోన్స్ ఈ ప్రతిపాదనలు చేశారు. అంగారక గ్రహంపైకి మనుషులను పంపేలోగానే శుక్రుడిపై పరిశోధనలు చేయడం ఉత్తమమని వారంటున్నారు. శుక్రుడిని లక్ష్యంగా చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ‘హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కాన్సెప్ట్(హవోక్) మిషన్‌గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనలో ముందుగా శుక్రుడిపైనున్న వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
 
సరిగ్గా భూమిపై 50 కి.మీ. ఎత్తున ఉన్నటువంటి వాతావరణమే వీనస్‌పై కూడా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ భూమిపై కంటే కొంచెం తక్కువగా ఉంటాయని, అలాగే శుక్రుడిపై దిగే వ్యోమగాములకు ఎలాంటి రేడియేషన్ ముప్పు కూడా ఉండదని చెబుతున్నారు. శుక్రుడు సూర్యుడికి దగ్గరగా ఉండడం వలన భూమిపై కంటే 40 శాతం సౌర శక్తి అధికంగా లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 
 
పైగా అంగారకుడిపైకి వ్యోమగాములను పంపడానికి 500 రోజులకుపైగా పడుతుందని, అదే శుక్రుడిపైకి 440 రోజుల  ప్రయాణంతోనే చేరుకోవచ్చు. ముందుగా రోబోను పంపి, తర్వాత ఇద్దరు వ్యోమగాములను అక్కడ నెల రోజుల పాటు ఉంచాలని చూస్తోంది. తేలియాడే కాలనీలు కట్టవచ్చునని భావిస్తున్నారు. సౌరశక్తితో నడిచే రెండు వ్యోమనౌకలను కూడా డిజైన్ చేస్తోంది. ఆ రోజుల వస్తే భూ భారం కొంతైనా తగ్గుతుంది.