Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజినీ పార్టీ పేరు ధర్మచక్రం? గుర్తు విష్ణుచక్రం? పవన్ 'చక్రం'తో పదనిసలా...?

గురువారం, 18 మే 2017 (19:49 IST)

Widgets Magazine
Rajinikanth

దేవుడు ఆదేశించాడేమో..తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలు మారుతూ వచ్చాయి. తమిళ రాష్ట్రాన్ని పాలించే నాయకుడే కరువయ్యాడని బిజెపినే రంగంలోకి దిగి అన్నాడిఎంకే నేతల్లో చీలికలు తీసుకువచ్చిందనే విమర్శలు సైతం వచ్చాయి. ఐతే ఏమీ చేయలేక భాజపా సైలెంట్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. 
 
అయితే ఒక్కసారిగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ప్రచారం చేయడం, ఆ తరువాత రజినీ స్వయంగా అభిమానులతో మూడు రోజుల పాటు కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా రజినీ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన కూడా చేసేశారు. ఇదంతా ఒక ఎత్తయితే రజినీ ఇప్పటికే పార్టీ పేరు.. పార్టీ గుర్తు కూడా నిర్ణయించేసుకున్నారు. పార్టీ పేరు ధర్మచక్రం.. పార్టీ గుర్తు విష్ణుచక్రం. అసలు దీన్నే రజినీ ఎందుకు ఎంచుకున్నాడో చూడండి...
 
ధర్మ చక్రం.. ధర్మాన్ని ఎప్పుడూ కాపాడుతూ, ధర్మం కోసం ఎంతదూరమైనా వెళ్ళి ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ ధర్మమే ఆయుధంగా చివరి వరకు ప్రజల కోసమే శ్రమిస్తూ నడిచే పార్టీ.. ధర్మాన్ని కాపాడండి.. అది మిమ్మల్ని కాపాడుతుంది. ఇక విష్ణుచక్రం గుర్తునే రజినీ ఎందుకు ఎంచుకున్నారంటే.. రజినీ ఎక్కువగా హిమాలయాలకు వెళుతుంటారు. ప్రశాంతత కోసం, ఆధ్మాత్మిక భావన కోసం, శాంతి కోసం రజినీ ఎప్పుడూ హిమాలయాల బాట పడుతుంటారు. 
 
బాబాలను ఏ విధంగా పూజిస్తారో.. ఆ శ్రీ మహావిష్ణువును తన ప్రాణాల కన్నా ఎక్కువగా పూజిస్తారు రజిని. విష్ణువు చక్రం అంటే ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఆయన ఆ గుర్తును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే విషయంపై తన కుటుంబ సభ్యులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. విష్ణుచక్రం కింద శాంతికి ప్రతిరూపంగా నిలిచే పావురం ఉంటుంది. 
 
ఇదంతా పక్కా ప్రణాళికతోనే ఎంతో సన్నిహితులను రజినీ కూర్చోబెట్టి మరీ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇదే జరిగితే ధర్మాన్ని కాపాడేందుకు రజినీలో మరో అవతారాన్ని తమిళ ప్రజలు చూడక తప్పదు. ఈ రకంగా తమిళనాడులో రాజకీయ శూన్యత పూడిపోతుందేమో...? ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ కూడా తన జనసేన పార్టీ గుర్తు చక్రంలానే వుంటుంది మరి. ఈ రెండు చక్రాలు రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తాయో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Dharmachakra Party Name Party Symbol Vishnu Chakra

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్రగ్స్ మత్తు వీడిన ప్రముఖ హీరో... ప్రభుత్వంతో చర్చల్లో బిజీ బిజీ

ఇటీవల జరిగిన అభిమానుల సమావేశంలో ప్రసంగాన్ని ముగిస్తూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ...

news

అసభ్యకరమైన వ్యాఖ్యలు, అర్ధనగ్న చిత్రాలు దానికి నిదర్శనమా? పరకాల ప్రభాకర్ ఫైర్

అమరావతి : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే ...

news

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు ...

news

అరిష్టం అని అంటున్నా మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదట... ఇంతకీ ఏంటది?

ఏదైనా శుభాకార్యాలకు వెళ్లేటపుడు పిల్లి ఎదురుపడ్డా, కట్టెలు కనిపించినా ఆ శుభకార్యాన్ని ...

Widgets Magazine