Widgets Magazine Widgets Magazine

తెదేపా ఎమ్మెల్యేల్లో 'కట్టప్ప'లుగా కొందరు... జగన్ మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు...

మంగళవారం, 6 జూన్ 2017 (19:26 IST)

Widgets Magazine
Jagan

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే వుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరోవైపు అధికార పార్టీ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటోందని సమాచారం. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా తమ సర్వేల్లో మునిగితేలుతోందని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఇలా వుంటే స్వతంత్రంగా కొన్ని సంస్థలు కూడా తమదైన సర్వేలు చేస్తున్నాయి. 
 
ఈ సర్వేల్లో వైఎస్సార్సీపి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.... తెదేపా స్వయంకృతాపరాధమేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదనీ, వారు కట్టప్పల మాదిరిగా మారిపోయారని అంటున్నారు. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలన్న ధోరణి లేకపోవడంతో ప్రజల్లో వారి పట్ల విముఖత వ్యక్తమవుతోందట. 
 
మరోవైపు అమరావతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. మరో రెండేళ్లలో అది ఏ రూపు దాల్చుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలావుంటే గతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తెదేపాకు వెన్నుదన్నుగా వున్నారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. అలాగే భాజపా-తెదేపా మైత్రి కొనసాగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెదేపా ఒంటరి పోరు తప్పదు. ఇదే జరిగితే ఓట్ల చీలిక భారీగా వుంటుందనీ, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. 
 
ఫలితంగా ఆ పార్టీ అధికారం చేపట్టే అవకాశం వుంటుందని అంటున్నారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో బిజీగా వున్నారు. ట్విట్టర్లో స్పందిస్తున్నారు కానీ ఇంకా జనంలోకి పూర్తిగా రాలేకపోతున్నారు. ఎన్నికల నాటికి అటుఇటుగా వస్తే ఆ పార్టీ బలమైన పునాదులు వేసుకోవడం కష్టమేనంటున్నారు. మహా అయితే 10 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం వుంటుందని విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చీ తెదేపాకు మైనస్ అయ్యే ప్రమాదం వుందని చెపుతున్నారు. మరి ఈ పరిస్థితిని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాతుర్యంతో ఎలా నెగ్గుకొస్తారో చూడాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మద్యం కల్తీ చేస్తే లైసెన్స్ రద్దు... ఆదాయం రూ.3,900 కోట్లు.... ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్

అమరావతి: మద్యాన్ని కల్తీ చేస్తే ఆ షాపు లైసెన్స్ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు ...

news

భారతీయులందరూ.. దోసెకే ఓటేశారు.. ఇండియన్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్‌గా దోసె..

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా ...

news

హైదరాబాదులో చైనా ప్లాస్టిక్ బియ్యం.. అన్నం ముద్దను నేలకేసి కొడితే బంతిలా ఎగిరింది..!

హైదరాబాదులో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇప్పుడిప్పుడే దేశంలోని పలు రాష్ట్రాల్లో ...

news

ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల మహిళ బెత్తం దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆహారం తీసుకుంటుండగా కింద రాల్చిందనే కారణంతో ...