Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవెగౌడ... నిద్రపోలేదు కానీ అదే తీరు... కేసీఆర్ టూర్ సక్సెస్ అయినట్లేనా?(వీడియో)

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (17:41 IST)

Widgets Magazine

దేవెగౌడ. ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆయన ప్రధానమంత్రిగా వున్నప్పుడు దేవెగౌడపై పేలిని జోకులు అన్నీఇన్నీకావు. ఎంతో సీరియస్ సమావేశాల్లోనూ చాలా చక్కగా కునుకు తీస్తుండేవారు. ప్రయాణాల్లో అయితే ఇక చెప్పనవసరంలేదు. తాపీగా నిద్రలోకి జారుకునేవారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూడగట్టి తృతీయ ఫ్రంటును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దేవెగౌడను శుక్రవారం నాడు కలిశారు. 
kcr-devegowda
 
దేవెగౌడతో సమావేశమైన కొన్ని క్లిప్పింగులు బయటకు వచ్చాయి. అందులో నాయకులందరూ ఎంతో చురుకుగా వుంటే దేవెగౌడ మాత్రం తనదైన శైలిలో తలపై చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో వున్నట్లు కనిపించారు. వదిలేస్తే గురుడు నిద్రపోయేవారేమోనన్న సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద కేసీఆర్ సమావేశం ఏమేరకు సక్సెస్ అయ్యిందన్నది ప్రక్కనపెడితే మరోసారి దేవెగౌడను అలా చూసిన నెటిజన్లకు మాత్రం మంచి సరుకు దొరికినట్లయింది.
 
ఇకపోతే భేటీ అనంతరం దేవెగౌడ కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలబడటం సంతోషకరమని అన్నారు. దేశంలో పరిష్కారం కాని సమస్యలు వున్నాయనీ, రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయనీ, వీటిని అదుపు చేసి అభివృద్ధి బాటలో నడిపించాల్సిన ప్రభుత్వం రావాల్సి వుందన్నారు. దేవెగౌడతో కేసీఆర్ సమావేశమైన ఈ దృశ్యాలను చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నవాజ్ షరీఫ్‌కు షాక్: ఎన్నికల్లో పోటీకి నో.. సుప్రీం జీవిత కాల నిషేధం

పనామా పేపర్స్ కేసు నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సుప్రీం కోర్టు వేటు ...

news

తన భర్తను చంపితే పదిమందికి పడక సుఖం ఇస్తానంది....

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. కట్టుకున్న భర్తను చంపించేందుకు తన శీలాన్నే ఎరగా వేసిందో ...

news

బెంగుళూరులో కేసీఆర్... వెంట ప్రకాష్ రాజ్.. తెరాసలో చేరినట్టేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ...

news

దేవుడా... గుడిలోనే 8 యేళ్ల బాలికపై 7 రోజులు లైంగికదాడి...

దేశంలో మహిళలే కాదు.. ఏమీ తెలియని బాలికల మానప్రాణాలకు కూడా రక్షణ కరవైంది. జమ్మూకాశ్మీర్ ...

Widgets Magazine