శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (18:05 IST)

అల్లుడా.. మజాకా! అత్త పదవి.. అల్లుడు పెత్తనం... ఇదీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడి తీరు!

ఈ టైటిల్‌ చిరంజీవి సినిమా టైటిల్‌ అనుకుంటున్నారు కదూ.. ఆ సినిమాలో అత్త, అత్తకూతుర్లను హీరో చిరంజీవి ఓ ఆటాడుకుంటారు. సీన్ కట్ చేస్తే.. ఇపుడు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్‌.

ఈ టైటిల్‌ చిరంజీవి సినిమా టైటిల్‌ అనుకుంటున్నారు కదూ.. ఆ సినిమాలో అత్త, అత్తకూతుర్లను హీరో చిరంజీవి ఓ ఆటాడుకుంటారు. సీన్ కట్ చేస్తే.. ఇపుడు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్‌. ఈయన అత్త పదవితో మజా చేస్తున్నాడు. పేరుకే ఎమ్మెల్యే సుగుణమ్మ అయితే పెత్తనం మొత్తం సంజయ్‌దే... సుగుణమ్మను కలిసే వారికంటే సంజయ్‌ను కలిసేవారే ఎక్కువున్నారంటే ఆయన పెత్తనం ఏ పాటిదో ఇప్పటికే అర్థమవుతుంది. ఎమ్మెల్యే హోదాలో సంతకాలన్నీ సుగుణమ్మ చేసినా ఆ సంతకాలన్నీ దగ్గరుండి చేయించేది మాత్రం అల్లుడే. అల్లుడికి తెలియందే అత్త ఏమీ చేయలేని పరిస్థితి. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు సంజయ్‌లపై ప్రత్యేక కథనం.
 
ఎమ్మెల్యే. ఇది ఎంత పెద్ద పెదవి మీకే తెలుసు. ఒక నియోజకవర్గానికే పెద్ద దిక్కు. నియోజకవర్గంలోని ప్రజలందరి అభివృద్ధిని చూడాల్సిన బాధ్యత. అందులోను ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి లాంటి ప్రాంతం. ఇంకేముంది ఎంతో కష్టపడి పనిచేస్తే తప్ప ప్రజల నుంచి మన్ననలు రావు. తిరిగి ఎన్నికల్లోను గెలవలేరు. అలాంటి పదవి అది.
 
అంతటి గొప్ప పదవిని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఏ మాత్రం కాపాడులేకపోతున్నారు. కారణం సంజయ్‌. ఈయన ఎవరో కాదు స్వయానా సుగుణమ్మకు అల్లుడు. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ బతికి ఉన్న సమయంలో తన కుమార్తెల కోసం సొంత బంధువును ఇచ్చి వివాహం చేశాడు. సుగుణమ్మ కుమార్తెలు మానసిన వికలాంగులు. మొదటి అల్లుడే సంజయ్‌. వెంకటరమణ బతికి ఉన్నంత కాలం మొత్తం ఆయనే బాధ్యతలను చూసుకున్నారు. ఆయన మరణానంతరం పెత్తనం మొత్తం అల్లుడి సంజయ్‌ ప్రారంభించారు.
 
ఎందుకంటే ఎమ్మెల్యే సుగుణమ్మ మృదుస్వభావురాలు. ఎంఎ చేసిన ఎమ్మెల్యే సుగుణమ్మకు అసలు ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచనే లేదు. భర్త మరణానంతరం వేరే దారి లేక రాజకీయాల్లోకి వచ్చారు సుగుణమ్మ. సానుభూతితో భారీ మెజారిటీతో గెలిచారు. గెలుపు విషయం అటుంచితే ఆమె చేయాల్సిన పనులన్నీ ఎమ్మెల్యే అల్లుడే చక్కదిద్దేస్తున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించే దాకా ప్రతి ఒక్కటి సంజయే చేస్తుంటాడు. ఇక ఎమ్మెల్యే అంటారా.. మామూలే. ఇంటి పనులకే పరిమితమయ్యారు. కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు ఎమ్మెల్యే ఇంటికి వస్తే ఎమ్మెల్యే సుగుణమ్మే స్వయంగా వారికి వండి వడ్డిస్తూ సపర్యలు చేస్తూ ఉంటారు. 
 
ఇక సంజయ్‌ వారి పక్కన కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటాడు. ఏ కార్యక్రమమైనా సరే నేరుగా సుగుణమ్మ వద్దకు వెళ్లదు. సంజయ్‌కు చెప్పిన తర్వాత ఆమె దృష్టికి వెళుతుంది. అల్లుడు తల ఊపితేనే కార్యక్రమానికి వెళ్ళాలి. లేకుంటే ఇక తెలిసిందే. ఆ విధంగా సొమ్ము ఒకరిది. సోకు మరొకరది అన్నట్లుగా సంజయ్‌ తీరు. ఉపఎన్నికల సమయంలో కూడా సంజయే ముందుండి డబ్బూ, గట్రా కార్యక్రమాలన్నీ కానిచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే.
 
ఇక ఎమ్మెల్యేకి వినతులు ఇవ్వాలంటే ముందుగా ఉండేది సంజయే. ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులన్నీ ఈయన చేతి నుంచే వెళ్ళాల్సిందే. వినతులను స్వీకరించాలంటే సంజయ్‌ సార్‌కు మంచి మూడ్‌ ఉండాల్సిందే. లేకుంటే ఎట్టిపరిస్థితిల్లోను వాటిని తీసుకోరు. అలా సంజయ్‌ ప్రవర్తన అంతా.. ఇంతా.. కాదు. ఇంటికి (మగ) అనే పెద్ద దిక్కు లేకపోవడంతో ఎమ్మెల్యే సుగుణమ్మకు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. సంజయ్‌ తీరు కొంతమంది స్థానిక తెదేపా నేతలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్యే కార్యక్రమాలన్నీ సంజయ్‌ చేయడమేంటని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సంజయ్‌ పోటీ చేస్తారన్న పుకార్లు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉన్నాయి. సంజయ్‌ ఇలాగేవుంటే తిరుపతి ప్రజలే కాదు స్థానిక తెదేపా నేతలు కూడా పార్టీకి దూరమవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.