శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (15:09 IST)

తిరుపతికా... ఎందుకు.. మీకేం పనులు లేవా.. అనుచరులతో తిరుపతి ఎంపీ వరప్రసాద్

తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్‌. ఈ పేరు పెద్దగా పట్టణవాసులకు తెలియదు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వరప్రసాద్‌. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున తిరుపతి ఎంపిగా పోటీ చేసి మొదటిస

తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్‌. ఈ పేరు పెద్దగా పట్టణవాసులకు తెలియదు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వరప్రసాద్‌. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున తిరుపతి ఎంపిగా పోటీ చేసి మొదటిసారి గెలిచారు. తమిళనాడులో ప్రభుత్వ అధికారిగా ఉన్న వరప్రసాద్‌ ఒక్కసారిగా రాజకీయాలకు రావడానికి కారణాలు లేకపోలేదు. తన సన్నిహితులకు, జగన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాగానే ప్రజాప్రతినిధిగా గెలుపొందారు. అయితే తిరుపతిలో పర్యటించిన దాఖలాలు మాత్రమే చాలా తక్కువే. పట్టణ ప్రజలు వేళ్ళమీద ఎంపి పర్యటన చెప్పేస్తారంటే ఈయన ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యారో అర్థమవుతుంది. తిరుపతికి వెళ్ళాలంటేనే మన ఎంపిగారికి ఇష్టముండదట. ఎందుకు తిరుపతికి.. ఇంకేం పనిలేదా అంటూ... తన అనుచరులనే కసురుకుంటారట. అసలు తిరుపతి ఎంపి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం..
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి తిరుపతి పార్లమెంట్ నుండి పోటీ చేసే అభ్యర్థే ఎన్నికల సమయంలో కరువయ్యారు. దీంతో ఒక్కసారిగా తమిళనాడుకు చెందిన వరప్రసాద్‌ అనే వ్యక్తి పేరు వినబడింది. వినబడడమే కాదు ఆయనకు బి.ఫారం ఇవ్వడం, ఆ తర్వాత పెద్దగా ప్రచారం చేయకుండానే గెలిచిపోవడం అన్నీ జరిగిపోయాయి. అందుకు కారణం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకుండా బీజేపీ నుంచి అభ్యర్థి పోటీ చేయడమే వరప్రసాద్‌ ఈజీగా గెలిచిపోవడానికి కారణమైంది. బీజేపీ అభ్యర్థి ధీమానే ఆయన కొంపముంచింది. వైసిపి గుర్తుతోనే ఈజీగా గెలిచిపోయారు వరప్రసాద్‌..
 
ఇదంతా బాగానే ఉన్నా.. అసలు విషయం ముందుంది. ఎంపిగా గెలిచిన తర్వాత తిరుపతి అభివృద్ధిపై దృష్టిసారించాలి. పోరాడాలి. ఇది ప్రజాప్రతినిధి తీరు. అయితే అందుకు వరప్రసాద్ పూర్తి విరుద్ధం. ఎంపీగా గెలిచిన తర్వాత అతి తక్కువసార్లు మాత్రమే తిరుపతిలో పర్యటించారు. ఎందుకంటే ఆయనకు సొంత బిజినెస్‌లు ఎక్కువ. ఆ పని మీదే ఎప్పుడూ బిజీగా ఉంటారు. అప్పుడప్పుడు చుట్టుపుచూపుగా తిరుపతికి వచ్చివెళుతుంటారు. ప్రజలకు చేతులూపి వెళ్ళిపోతుంటారు. అసలు చాలామందికి ఇప్పటికీ తిరుపతి పార్లమెంట్ సభ్యులంటే ఎవరో కూడా తెలియదంటే ఆయన ఏ మాత్రం తిరుపతిని అభివృద్ధివైపు నడిపిస్తున్నారో అర్థమవుతుంది.
 
సొంత బిజినెస్‌ పనుల్లో ఉన్న వరప్రసాద్‌ను తన అనుచరులు ఎప్పుడైనా తిరుపతికి వెళదామని అడిగితే.. ఎందుకు.. తిరుపతికి.. ఇంకేం పనిలేదా మనకి... వెళ్ళి మన పనులు చూడు. అంటూ అక్కడి నుండి పంపేస్తారట. ఇదిలావుంది ఎంపీగారి పరిస్థితి. వరప్రసాద్‌ అసలు తిరుపతి నియోజవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదన్న విషయం ఇప్పటికే చాలాసార్లు అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారట. అయితే ఈ విషయంపై జగన్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.