Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాయపాటి - మురళీమోహన్ మధ్య రచ్చ.. ఎందుకు..?

సోమవారం, 15 మే 2017 (12:49 IST)

Widgets Magazine
lord venkanna

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పోస్టు కాస్త ఇద్దరు తెదేపా సీనియర్ నేతల మధ్య గొడవకు దారితీస్తోంది. ఎప్పటి నుంచో తితిదే ఛైర్మన్ పదవి తనదేనంటూ ధీమాతో ఉన్న గుంటూరుకు చెందిన రాయపాటి చివరకు సినీనటుడు మురళీ మోహన్ అడ్డు రావడంతో ఏం చేయాలో తెలియక తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మురళీమోహన్ మాత్రం ఆ పదవి తనకేనంటూ, బాబు తన స్నేహితుడు కాబట్టి.. ఇక దీనిపై మాట్లాడిన అవసరం లేదంటూ తన సన్నిహితులతో చెప్పారట. అయితే తాజాగా సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చినవెంటనే ఇద్దరూ మరోసారి వెళ్ళి కలిసి పదవి కోసం అర్జీలు పెట్టుకున్నారట.
 
తితిదే ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం ముగిసిన వెంటనే ఆ పదవి కోసం పోటీలు పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మంత్రిగా అవకాశం లభించని వారు తితిదే ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన గాలిముద్దుక్రిష్ణమనాయుడు, జ్యోతుల నెహ్రూ మిగిలిన కొంతమంది. అయితే అంతకుమందు నుంచే పదవి కోసం ఖర్చీఫ్‌ వేశారు రాయపాటి, మురళీమోహన్‌లు. 
 
కానీ పోటీ పడిన వారిలో చాలామంది సైలెంట్ అయిపోయారు కానీ చివరకు ఇద్దరి మధ్యే పోటీ కనబడుతోంది. వారే రాయపాటి, మురళీమోహన్. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది... అంత వైరం ఉందన్నమాట. ఈ మధ్య ఒకరికి ఒకరు ఎదురుపడ్డారట. అయితే ఎడమొఖం, పెడ మొఖం లాగా పెట్టుకుని వెళ్ళిపోయారట. వీరి మధ్య గొడవ ప్రస్తుతం తెలుగు దేశంపార్టీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
War Tdp Murali Mohan Ttd Chairman Post Rayapati Sambasiva Rao

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో రోడ్డుప్రమాదం - చిత్తూరు జిల్లా విద్యార్థి దుర్మరణం

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్.పురంకు ...

news

చంద్రబాబు దోచుకున్న డబ్బునే దాచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు : ఆర్కే.రోజా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ...

news

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై మ్యాట్ వేసుకుని యోగా చేయాలి..

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై యోగా చేయాలా? ఇదేంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ...

news

బాబోయ్ సుజనా మా కొద్దు... ఎవరన్నారో తెలుసా..!

కేంద్రమంత్రి సుజనాచౌదరి.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత ...

Widgets Magazine