Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి రూ.వెయ్యి కోట్ల ఆస్తి టాటా కంపెనీకి.. ఎందుకు..?

మంగళవారం, 16 మే 2017 (15:21 IST)

Widgets Magazine

వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా సరిపోతుందన్న సామెత ఒకటుంది. తిరుమల శ్రీవారి ఆస్తులే కదా ఇచ్చేస్తే పోలే అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల తిరుమల శ్రీవారి ఆస్తిని అప్పనంగా టాటా కంపెనీ చేతిలో పెట్టారు. దీనికొక పేరు కూడా పెట్టారు. కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసమని. అయితే ఈ మొత్తంలో టాటా కంపెనీ ఎంత ఖర్చు చేస్తుందో... ఎంత స్వాహా చేస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు.
 
సొమ్ము ఒకటిది.. సోకొకడిది అన్న చందంగా తయారైంది తితిదే ఉన్నతాధికారుల తీరు. భక్తులు ఎంతో భక్తిభావంతో స్వామివారికి సమర్పించే డబ్బును ఇష్టానుసారం ప్రైవేటు కంపెనీలకు దానం చేస్తున్నారు. కోల్‌కత్తాలో టాటా కంపెనీ కేన్సర్ ఆసుపత్రిని నడుపుతోంది. ఈ కేన్సర్ ఆసుపత్రికి అంతో ఇంతో పేరుంది. దీన్ని దృష్టిలో  పెట్టుకున్న తితిదే ఒక కేన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టాటా కంపెనీకి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీని విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. 
 
టాటా కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కూడా చేసేసుకున్నారు తితిదే ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రైవేటు కంపెనీ చేతుల్లో విలువైన ఆస్తిని పెట్టడంపై ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పార్లమెంట్‌లో పిల్లాడితో ఆడుకున్న కెనడా ప్రధాన మంత్రి (ఫోటోలు)

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ తన మూడేళ్ల కుమారుడితో పార్లమెంట్‌కు వచ్చారు. తన మూడేళ్ల ...

news

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి కారణమిదే!

ఏపీ పురపాలక శాఖామంత్రి నిషిత్ నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మరణించడానికి ...

news

గర్భిణీ మహిళను ఆఫీసులో ఎలా చూసుకోవాలి.. ఈ వీడియో చూసి తెలుసుకోండి.. (video)

నవమోసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం ప్రతి స్త్రీకి ఓ వరం. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు ...

news

భారత మ్యాప్‌లో చాలా నదులు ఉన్నాయి.. నీళ్లు మాత్రం లేవు.. ఏం చేద్దాం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా ...

Widgets Magazine