శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Modified: బుధవారం, 16 జనవరి 2019 (15:06 IST)

వెబ్ దునియా సర్వే 2018- పవన్ కల్యాణ్ అక్కడున్నారు... పాయల్ రాజ్‌పుత్ ఇక్కడుంది...

వెబ్ దునియా తెలుగు ప్రాంతీయ సర్వేను గత ఏడాది చివరి వారం నుంచి 7 జనవరి 2019 వరకూ నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న మా యూజర్లకు ధన్యవాదాలు. ఇకపోతే... సర్వేలో ఆయా అంశాలపై ఆరు ప్రశ్నలను అడిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఇలా వున్నాయి.
 
2018లో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటనకు మొత్తం 184 ఓట్లు పోలవగా అందులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అతి పెద్ద సంఘటనగా సర్వేలో తేలింది. అత్యధికంగా 59 ఓట్లు రాగా 32 శాతం మంది దీన్ని సమర్థించారు.
 
రెండవ ప్రశ్నగా 2018లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతీయ ప్రముఖుడికి అత్యధికంగా కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. 25 శాతం మంది ఆయన్ను సమర్థించగా ఆ తర్వాత 22 శాతంతో పవన్ కల్యాణ్, 20 శాతంతో జగన్ మోహన్ రెడ్డి నిలబడ్డారు. 
 
2018లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఎవరని అడిగితే... ఏకంగా 37 శాతం మంది విజయ్ దేవరకొండ నెం.1 అని సూచించారు. ఆ తర్వాత 22 శాతంతో రామ్ చరణ్, 21 శాతంతో జూనియర్ ఎన్టీఆర్ వున్నారు.
 
2018లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణి ఎవరని సర్వేలో అడుగగా.. 38 శాతంతో కీర్తి సురేష్ ప్రధమ స్థానాన్ని ఆక్రమించారు. 34 శాతంతో గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన, 10 శాతంతో సమంత వున్నారు.
 
2018లో ఉత్తమ చిత్రం ఏది అని అడుగ్గా, 34 శాతంతో రంగస్థలం చిత్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత 24 శాతంతో మహానటి, 10 శాతంతో భరత్ అనే నేను వున్నాయి.
 
2018లో సెక్సీయెస్ట్ నటీమణి ఎవరు అనంటే... 34 శాతంతో పాయల్ రాజ్ పుత్‌ నెం.1 స్థానంలో నిలబడింది. ఆ తర్వాత అనుష్క-రష్మిక మందనలు వున్నారు.