గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (10:09 IST)

ఈ దీపావళి ఈ రాశులకు కలిసొస్తుందట..!?

ఈ దీపావళి కింది రాశులకు కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపాల పండుగ దీపావళిని 2020లో నవంబర్-14 అంటే శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ వెలుగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను అందించనుంది. ఈ రాశుల వారికి ఈ దీపావళి శుభాన్నిస్తుందని, లాభాన్నిస్తుందని, సుఖశాంతులను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ముందుగా వృషభ రాశీ వారికి ఈ దీపావళి మరో కొత్త ఆరంభానికి మంచి సమయం. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభం చేకూరుతుంది. బంధాల్లో ఉన్న చిక్కులు తగ్గి. సంతోషం కలుగుతుంది. ఇక తులారాశి జాతకులకు ఈ దీపావళి శుభాన్నిస్తుంది. సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రశాంతత చేకూరుతుంది. 
 
సరికొత్త వ్యాపారానికి కలిసొచ్చే కాలం. భూ సంబంధిత వివాదాలు ముగుస్తాయట. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వాహన యోగం వుంది. విదేశీ ప్రయాణం అవకాశం ఉంది. తారాబలం వల్ల ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది.  ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ప్రమోషన్ అవకాశం వుంది.
 
కుంభ రాశి వారికి ఈ దీపావళి అదృష్టాన్ని తీసుకురానుంది. లక్ష్మీ కటాక్ష సౌభాగ్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. ఉద్యోగంలో చిక్కులు తొలగనుంది. వివాహంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోనున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.