సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (18:06 IST)

దీపావళి నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే?

దీపావళి రోజున తలస్నానం ఎందుకు చేయాలంటే.. పూర్వ కాలంలో పెద్దలు శనివారం వచ్చిదంటే చాలు.. మనుమళ్లకు మనువరాళ్లకు నువ్వుల నూనెతో తలస్నానం చేయించేవారు. ఇలా తలస్నానం చేయడం వలన కంటి ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెప్తుంటారు. అందుకనే నువ్వుల నూనెతో తలస్నానం చేయిస్తారు.
 
దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను తల మాడుకు, శరీరానికి రాసుకుని.. ఆయిల్ మసాజ్‌ చేసుకుని అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తరువాత వేనీళ్లతో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో శుచిగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి. 
 
ఈ పండుగ నాడు ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసే వారికి శనిగ్రహదోషాలు తొలగిపోతాయని, శనీశ్వర లేదా.. హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.