గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 ఏప్రియల్ 2022 (21:17 IST)

ఉత్సాహపూరితమైన ఆఫర్లతో తమ మెగా వార్షికోత్సవ విక్రయాలను ప్రకటించిన ఓరా

ORRA
భారతదేశపు సుప్రసిద్ధ వజ్రాభరణాల బ్రాండ్‌ ఓరా, తమ వార్షికోత్సవ వేడుకలను ప్రత్యేక ఆఫర్లతో నిర్వహిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా అన్ని ఓరా స్టోర్లు, వెబ్‌సైట్‌పై ఈ ఆఫర్‌ లభ్యమవుతుంది. ఈ వేడుకల కాలంలో, ఒరా విస్తృతశ్రేణి జ్యువెలరీ డిజైన్లను తీర్చిదిద్దింది. ఇవి అసాధారణ పనితనంతో కాలాతీత ఆభరణాలుగా నిలుస్తాయి.

 
ఎంచుకునేందుకు విస్తృతశ్రేణిలో ఉన్న ఆభరణాలతో పాటుగా మెగా ఆఫర్లు కూడా మిళితం కావడం వల్ల వినియోగదారులు తమ వైవిధ్యమైన అభిరుచులు, సందర్భాలకు అనుగుణంగా ఆభరణాలను పొందవచ్చు. అతి సున్నితంగా తీర్చిదిద్దిన ఇయర్‌ రింగ్స్‌ నుంచి ఆస్ట్రా శ్రేణి అసాధారణ మైన్పటికీ అందుబాట ధరల్లోని వజ్రాల నెక్లెస్‌లు, ఇయర్‌ రింగ్స్‌‌తో ఓరా స్ధిరంగా నూతన డిజైన్లను పరిచయం చేయడంతో పాటుగా మారుతున్న వినియోగదారుల డిమాండ్స్‌ను తీర్చే ప్రయత్నం చేస్తుంది.

 
ఒరా ఈ దిగువ ఆఫర్లను ప్రకటించింది:
వజ్రాభరణాలపై  25% రాయితీ మరియు ఈఎంఐపై 0% వడ్డీ. ఈ సదుపాయం అందిస్తున్న ఒకే ఒక్క ఆభరణాల బ్రాండ్‌
అక్షయ తృతీయ మరియు గుడి పడ్వా సందర్భంగా ఈ బ్రాండ్‌ తమ ప్రత్యేకమైన నెక్లెస్‌ సెట్‌ను 69,999 రూపాయల ధరలో విడుదల చేసింది. 14 కెరట్‌ల ఎల్లో గోల్డ్‌ నెక్లెస్‌లను రెడ్‌ మరియు గ్రీన్‌ కలర్డ్‌ రాళ్లలో తీర్చిదిద్దింది

 
ఈ సందర్భంగా ఓరా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపు మెహతా మాట్లాడుతూ, ‘‘మా వార్షికోత్సవ అమ్మకాలను వేడుక చేస్తూ ఈ ఆఫర్లను ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నాము. సమృద్ధితో కూడిన షాపింగ్‌ అనుభవాలను మా వినియోగదారులకు అందించడంతో పాటుగా వారి కొనుగోళ్లకు అత్యుత్తమ విలువను అందిస్తున్నాం. అక్షయ తృతీయ , గుడి పడ్వా వంటి పండుగలు శుభారంభాన్ని సూచిస్తాయి మరియు మా వినియోగదారులు  మా ఓరా స్టోర్లు అన్నింటిలోనూ గొప్ప ఆఫర్లు, అదనపు ప్రయోజనాల కోసం ఎదురుచూడవచ్చు’’ అని అన్నారు. ఈ ఆఫర్లు 25 మార్చి 2022 నుంచి 07 మే 2022 వరకూ భారతదేశ వ్యాప్తంగా ఓరా రిటైల్‌ స్టోర్లు మరియు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి.