గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 జూన్ 2023 (19:30 IST)

“మీలో ఉన్న రాణికి వివాహ ఆభరణాలు”: రిలయన్స్ జువెల్స్ నుంచి వివాహం కలెక్షన్ విడుదల

Vivaham collection
ఆభరణాల పరిశ్రమలో ప్రముఖ సంస్థ అయిన రిలయన్స్ జివెల్స్, ఎంతగానో ఎదురుచూస్తున్న తన “వివాహం కలెక్షన్” ఏ అంతస్తుకు చెందిన వధువు అయినా తన ప్రత్యేకమైన రోజున ఒక రాణిలా అనుభూతి చెందుటకు రూపొందించబడిన ప్రత్యేక వివాహ ఆభరణాల శ్రేణిని ప్రారంభించుటకు సంతోషిస్తోంది. ఈ కలెక్షన్ భారతదేశములోని అన్ని ప్రాంతాలకు చెందిన వధువుల భిన్నత్వానికి మరియు అందానికి, వారి ప్రత్యేక శైలులను మరియు స్ఫూర్తిని ఆకట్టుకుంటూ, నివాళులర్పిస్తుంది.
 
వివిధ ప్రాంతాల గొప్ప సాంస్కృతిన వారసత్వాన్ని కలుపుకుంటూ, వివాహం కలెక్షన్, భారతదేశములోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తూ, 15+ విభిన్నమైన వైవాహిక ఆకర్షణను ప్రదర్శిస్తుంది. సంపన్నమైన బెంగాలి వధువు నుండి మెరిసిపోయే ఒడిశా వధువు వరకు, అందమైన మహారాష్ట్ర వధువు నుండి సొగసైన రాజస్థాని వధువు వరకు, ఆధునికమైన మెట్రో వధువు నుండి అబ్బురపరచే పంజాబి వధువు వరకు, పొందికైన తెలుగు వధువు నుండి శోభాయమానంగా ఉన్న బిహారి వధువు వరకు, భారతదేశపు గొప్ప వివాహ సంస్కృతి మరియు సంప్రదాయాలను తెలిపే మరెన్నో అబ్బురపరచే మరియు గమ్మత్తైన శైలులు. ప్రతి వధువును పరిపూణంగా చూపించేందుకు రిలయన్స్ జివెల్స్ ఆభరణాలను సునిశితంగా తయారుచేసింది, తద్వారా వివాహ ఆభరణాల అవసరాల కొరకు దీనిని వన్ స్టాప్ షాప్ గా చేసింది. ఈ కలెక్షన్ లో చోకర్స్, పొడవైన నెక్లెస్ లు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, చోకర్ సెట్లు, మంగళసూత్రాలు, పాపిటబొట్లు, నత్తులు, హాత్‎ఫూల్స్, వడ్డాణాలు, ఆర్మ్‎బ్యాండ్స్, కంకణాలు మరియు మరెన్నో ఉన్నాయి. వైవిధ్యమైన ఈ కలెక్షన్ ప్రతి ప్రాంతపు వధువుల కొరకు సంబరాలు జరుపుతుంది, తద్వారా సంస్కృతులు మరియు సంప్రదాయాల సమన్వయాన్ని ఏర్పరుస్తుంది.
 
“మా వివాహ కలెక్షన్ భారతీయ వివాహాల వైభవము మరియు వైవిధ్యాలకు ఒక ప్రామాణికము,” అని శ్రీ సునీల్ నాయక్, సీఈఓ, రిలయన్స్ జివెల్స్ అన్నారు. “ప్రతి వధువు, తన కులము, వయసు, సామాజిక-ఆర్ధిక వర్గము లేదా ప్రాంతానికి సంబంధం లేకుండా, తన వివాహము రోజున ఒక రాణిలాంటి అనుభూతికి అర్హురాలు అని మేము విశ్వసిస్తాము. మా కలెక్షన్ భారతీయ వధువుల రాచరిక ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. ఇవి వారు ఆభరణాలను ఎంపిక చేసుకోవడములో స్పష్టంగా తెలుస్తాయి. మేము ప్రతి ప్రాంతము యొక్క సారాన్ని పట్టుకోవాలని అనుకున్నాము, దీని వలన వధువులు చక్కదనము మరియు లావణ్యాలను ప్రసరింపజేస్తూ తమ సాంస్కృతిక గుర్తింపును స్వీకరిస్తారు. ఈ కలెక్షన్ లో ప్రతి ఆభరణము ఉన్నతమైన హస్తకళతో సూక్ష్మంగా తయారు చేయబడింది, వీటితో వధువులు తమ డి డే రోజుల రాణిలా మెరిసిపోతారు.”