బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 డిశెంబరు 2024 (22:37 IST)

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

Dresses
రిలయన్స్ రిటైల్ యొక్క లేటెస్ట్ స్టైల్ ఐకాన్ కలెక్షన్ యూస్టా. ఇప్పటికే భారతదేశంలోని యువతను విశేషంగా ఆకట్టుకున్న యూస్టా బ్రాండ్ కలెక్షన్... ఇప్పుడు తమ వ్యాపార పరిధిని దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింతగా విస్తరించే క్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాగోల్‌లో సరికొత్త స్టోర్‌ని ప్రారంభించింది. ఈ సరికొత్త స్టోర్.. నాగోల్-అల్కాపురి క్రాస్ రోడ్స్‌‌లో ప్రారంభించబడింది.
 
యూస్టా ప్రారంభం నుంచే ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఈ యూస్టా స్టోర్స్ ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. విలక్షణమైన "స్టారింగ్ నౌ" కలెక్షన్ ద్వారా డిఫరెంట్ రేంజ్ ట్రెండీ టాప్-టు-బాటమ్ ఎంసెట్‌లు, యునిసెక్స్, క్యారెక్టర్ మర్చండైజ్, వీక్లీ ఫ్యాషన్ డ్రాప్‌లతో యువతను ఆకర్షించేలా యూస్టా స్టోర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇక అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... యూస్టా స్టోర్స్‌లో దుస్తులు కేవలం రూ. 179 నుంచి ప్రారంభం అవుతాయి. తద్వారా యువతకు అవసరమైన దుస్తుల్ని అతి తక్కువ ధరకే అందిస్తూ అందర్ని ఆకర్షిస్తోంది యూస్టా.  
 
ఇక నాగోల్‌లో ఏర్పాటు చేసిన స్టోర్ విషయానికి వస్తే... గతంలో ఉన్నటువంటి కౌంటర్‌ పార్ట్ స్టోర్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా సమకాలీన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్వీయ-చెక్‌ అవుట్ కౌంటర్‌లు, వినియోగదారుల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లతో పాటు ఆధునిక, సాంకేతికతతో ప్రారంభించబడిన షాపింగ్ వాతావరణాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. కస్టమర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్‌తో యూస్టాతో వారి ప్రత్యేకమైన మరియు ఇష్టమైన స్టైల్‌లను పోస్ట్ చేయడానికి బ్రాండ్ తన కస్టమర్‌లను ఆహ్వానిస్తుంది.
 
యూస్టా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు సుస్థిరతను కూడా నొక్కి చెబుతుంది. ఈ స్టోర్ స్థానికంగా ఉండే లాభాపేక్ష లేని సంస్థలకు సహకరిస్తుంది. కమ్యూనిటీ మద్దతు మరియు స్థిరత్వ ప్రయత్నాలలో భాగంగా పాత దుస్తులను విరాళంగా ఇవ్వమని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు నాగోల్‌లో అద్భుతమైన కలెక్షన్ ను అన్వేషించవచ్చు.