సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:54 IST)

చేతులకు ఎలాంటి గాజులు వేసుకోవాలంటే..?

చేతులకు మెరిసే బంగారు గాజుల మధ్య మట్టి గాజులు వేసుకుంటే మరింత నిగారింపు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. 
 
ఇక చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ ఉంటాయి. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడం కన్నా వెడల్పుగా వుండే సింగిల్ గాజు వేస్తేనే అందంగా వుంటుంది. రోజూ వేసుకునే కటింగ్స్ గాజు, గాజులకు వుండే మెరుపు కొన్ని రోజులకు పోతుంది. వాటిని వెంటనే మార్చేయాలి. లేకుంటే అందవికారంగా ఉంటుంది. 
 
పెద్దవాళ్ళకు కాఫీ, నీలం, వైలెట్, ఎరుపు, ఆకుపచ్చ మొదలైన ముదురు రంగు గాజులపై డిజైన్స్ వున్న గాజులు బావుంటాయి. బంగారం గాజుల మధ్యలో మెరుపు గాజులు వేసుకోవడం కన్నా ప్లెయిన్ కలర్ ముదురు రంగు గాజులు వేసుకుంటే అందంగా ఉంటుంది.