గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (19:08 IST)

ప్రేమ జీవితం బలపడాలంటే.. దంపతుల మధ్య అన్యోన్యత కోసం.. ఫెంగ్‌షుయ్...?

love
ఫెంగ్ షుయ్ జీవితంలోని అనేక సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇది సాధన చేసే వ్యక్తికి మంచి ఆరోగ్యం, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది తప్పనిసరిగా మీ దైనందిన జీవితంలో మీ చుట్టూ ఉన్న వస్తువులను ఏర్పాటు చేయడం లేదా తిరిగి అమర్చడం ద్వారా శుభ ఫలితాలను అందిస్తుంది. ఒకరి జీవితంలో సానుకూల శక్తి ప్రయోజనకరమైన ప్రవాహాన్ని సులభతరం చేసే సానుకూల మానసిక స్థితిని అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫెంగ్ షుయ్ ప్రేమ జీవితాన్ని ప్రోత్సహించే పద్ధతులను కలిగి ఉంది. 
 
ఉదాహరణకు మీరు మీ జీవితంలో కాబోయే ప్రేమికుడిని ఆకర్షించాలనుకుంటే లేదా మీరు ఇప్పటికే సమస్యాత్మకమైన సంబంధంలో ఉన్నట్లయితే ఈ టిప్స్ పాటించవచ్చు. ముందు ప్రేమ జీవితాన్ని మెరుగుపురిచేందుకు ఫెంగ్ షుయ్ ఎనర్జీ లెవల్స్ పెంచాలి. ముందుకు బెడ్‌కి రెండు వైపులా బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. మంచం చుట్టూ సమానమైన శక్తి కోసం ఫెంగ్ షుయ్ ఉత్పత్తులను బెడ్‌కి రెండు వైపులా ఉంచడం చేయాలి. ఫెంగ్ షుయ్ యొక్క త్రిమూర్తులు అంటే పడకగది, బాత్రూమ్, వంటగది ఈ ప్రాంతాలలో సానుకూల శక్తి ప్రసరించేలా చూడాలి. అందుకే దంపతుల, ప్రేమికుల మధ్య బంధం బలపడాలంటే.. మీ గదిలో మీరు అత్యంత ఇష్టపడే ప్రేమ  చిత్రాలను ఉంచాలి. మీ భాగస్వామికి మధ్య మీకు కావలసిన సానుకూల శక్తిని పెంచడానికి ఫోటోగ్రాఫ్‌లు, సువాసనలు (ఎసెన్షియల్ ఆయిల్స్ రూపంలో), ఫెంగ్ షుయ్ రంగులను ఉపయోగించాలి. ముఖ్యంగా ఇంట... విరిగిన హృదయం, తుఫాను, విధ్వంసం వంటి చిత్రాలను సృష్టించే చిత్రాలను ఉంచకండి.
 
మీ ఇంటి నైరుతి ప్రాంతాన్ని పక్కా వుంచుకోవడం ద్వారా దంపతుల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయత కోసం భూమి, అగ్నికి సంబంధించిన చిత్రాలు, రంగులను వాడాలి. జంటలుగా వచ్చే ఫెంగ్ షుయ్ ఉత్పత్తులు, రోజ్ క్రిస్టల్ ఆఫ్ క్వార్ట్జ్ పడకగదిలో వుంచవచ్చు.