శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 డిశెంబరు 2014 (13:30 IST)

ఫెంగ్‌షుయ్: తలలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకోవచ్చా..?

ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం నీరు, నిప్పు, భూమి, చెక్క, లోహం అనే ఐదు మౌలిక అంశాలపై శక్తి ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం ఇంటి వాస్తు దగ్గర నుంచి మనిషి వేసుకునే బట్టలు, అతని హెయిర్‌స్టైల్ దాకా వర్తిస్తుంది. 
 
ఈ ఐదు మౌలిక అంశాలు ఏకీకృతమైనప్పుడు విజయం దానంతట అదే వస్తుంది. ఫెంగ్ షుయ్ ప్రకారం హెయిర్ స్టైల్ చేసుకుంటే తమకు అనుకూలిస్తుందని హాలీవుడ్ తారలంతా భావిస్తున్నారట. అంతేకాదు.. ఫెంగ్ షుయ్ ప్రకారమే హెయిర్ స్టైల్ కూడా చేసేసుకుంటున్నారట. 
 
అలాంటి ఫెంగ్ షుయ్ సూత్రాలేంటో తెలుసుకోవాలానుందా? అయితే ఈ స్టోరీ చదవండి. 
 
* తలలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకోకూడదు. అప్పుడే పూసిన పువ్వులను పెట్టుకుంటే తల ప్రాంతంలో ఉండే శక్తి పెరుగుతుంది. 
 
* తల భాగంగా దీర్ఘచతురస్రాకారంగా ఉంటే-రౌండ్ హెయిర్ కట్ చేయించుకోకూడదు. 
 
* మొహం అర్థచంద్రాకారంలో షేపులో ఉంటే రౌండ్ షేప్ చేయించుకోకూడదు. ఇలాంటి వారు జుట్టును పెద్దగా పెంచుకోకూడదు. 
 
* మీటింగ్‌లకు వెళ్లే సమయంలో జుట్టును విరబోసుకోకూడదు. మగవాళ్లు పక్కకు దువ్వుకోవాలి. 
 
* ముఖ్యమైన మీటింగ్‌లకు వెళ్లే సమయంలో తలకు ఎర్ర రంగు వేసుకుంటే విజయం లభిస్తుంది. మొత్తం జుట్టంతా ఆ రంగు వేసుకోవడం ఇష్టం లేనివారు కొన్ని పాయలకైనా ఆ రంగు వేసుకోవడం మంచిదని ఫెంగ్ షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.