శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By chitra
Last Updated : బుధవారం, 20 జనవరి 2016 (17:05 IST)

సిరిసంపదలే కాదు సౌభాగ్యం, విజయం, ఆనందాన్నిచ్చే లాఫింగ్ బుద్ధా!

మనం ప్రేమించేవారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్‌ బుద్ధాను కొనిస్తే సరి. ఫెంగ్‌షూయ్‌ వస్తువులలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. 
 
అన్నికష్టాలను, సమస్యలను తీరుస్తాడని నమ్మకం. పిల్లలు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు. ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్‌ వంటివాటితో వీటిని తయారు చేస్తారు. ఇవి రకరకాల ఫోజులలో కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. పూతాయ్‌గా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అతడిని చూడగానే వెంటనే దృష్టికి పడే లక్షణం అతను ఒక గోతంతో కనిపిస్తాడు.  
 
అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. హిందువులకు లక్ష్మీ‌దేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసే వారు తమ కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని నమ్మకం. ఇది ప్రతికూల ప్రాణ శక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం.
 
లాఫింగ్‌ బుద్ధా ప్రతిమను కొనేటప్పుడు సాధ్యమైనంత పెద్దది కొనుక్కోవడం మంచిది. సంపదను కోరుకునే వారు ఇతర ప్రతిమలను కాక కుండలో బంగారం ఉంచుకున్న లేదా భుజం పై సంచీ వేసుకున్న ప్రతిమను కొనుక్కోవడం మంచిది. కొన్న ప్రతిమను ద్వారానికి ఒక టేబుల్‌ మీద పెట్టుకోవాలి. ఆ విగ్రహాన్ని కింద పెట్టడమంటే అగౌరవపరచడమే. అందుకే ఇటీవల కాలంలో ఈ విగ్రహం మనకు ప్రతి చోటా కనబడుతోంది.